UCO Bank : ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల…!
ప్రధానాంశాలు:
UCO Bank : ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల...!
UCO Bank : బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులకు శుభవార్త. తాజాగా భారత ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైనటువంటి యూకో బ్యాంక్ నుండి దాదాపు 544 ఖాళీలను భర్తీ చేసేందుకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
UCO Bank నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైనటువంటి యూకో బ్యాంక్ నుండి విడుదల కావడం జరిగింది.
UCO Bank మొత్తం ఖాళీలు
ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 544 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
UCO Bank విద్యార్హత
ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అప్పుడే మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
వయస్సు…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారి వయస్సు 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్పుడే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయగలరు.
జీతం..
ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ఉత్తీర్ణత సాధించిన వారికి నెలకు రూ.15 వేలు జీతం గా ఇవ్వబడుతుంది.
ఎలా దరఖాస్తు చేయాలి…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు ముందుగా సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదుచేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.
రుసుము..
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ చివరి తేదీ…
ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు 16/07/2024 లోపు అప్లై చేసుకోగలరు.