Home » Andhra Pradesh » Byreddy Says With Continuous Practise You Will Go To High Positions
andhra pradesh

Kadapa..నిరంతర సాధనతోనే ఉన్నత స్థానాలకు..

Authored By
praveen T
The Telugu News | Published on: September 13, 2021, 4:12 pm
Advertisement

నిరంతర సాధనతోనే క్రీడాకారులు ఉన్నత స్థానాలకు చేరుకుంటారని ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. క్రీడాకారులకు నూతన పాలసీని త్వరలో అమలు చేయబోతున్నట్లు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సోమవారం తెలిపారు. నూతన క్రీడా పాలసీతో క్రీడాకారులకు అత్యుత్తమమైన భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. రెండు రోజుల నుంచి కడప సిటీలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సీనియర్స్ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్ పోటీలు ముగిశాయి. ఈ నేపథ్యంలో విజేతలకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ నూతన క్రీడాపాలసీతో క్రీడాకారులకు మేలు జరుగుతుందని చెప్పారు.

Advertisement

గ్రామీణ క్రీడాకారులకు నూతన క్రీడా పాలసీ ద్వారా ప్రోత్సహకం లభిస్తుందన్నారు. ఇకపోతే వైసీపీ యువ ఎమ్మెల్యే బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌గా నియమించడం పట్ల వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. క్రీడారంగంలో గణనీయమైన మార్పులు వైసీపీ యువనేత సిద్ధార్థరెడ్డి నాయకత్వంలో సాధ్యమేనని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే క్రీడాకారులకు ప్రోత్సాహకాలచ్చి వారిని ఉన్నతస్థానాలకు తీసుకెళ్లేందుకు వైసీపీ సర్కారు కృషి చేస్తుందని వైసీపీ నేతలు చెప్తున్నారు.

Advertisement

 

 

Advertisement

 

 

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి