Home » Andhra Pradesh » Si Conducted Awareness Program On Cyber Crimes In Vivekananda Degree College
andhra pradesh

Kadapa..సైబర్ క్రైమ్స్‌పై అవగాహన

Authored By
praveen T
The Telugu News | Updated on: September 7, 2021 3:51 pm
Advertisement

ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోతున్న సంగతి అందరికీ విదితమే. సైబర్ నేరస్థులు రకరకాల పద్ధతుల్లో ప్రజలను నమ్మించి వారి డబ్బులను కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని వేంపల్లో వైఎస్ఆర్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎస్సై తిరుపాల్ నాయక్ పలు అంశాలపై మంగళవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన ‘దిశ’ యాప్ గురించి వివరించారు. ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇకపోతే కొవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. టీకా తీసుకున్నా మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించడం మస్ట్ అని తెలిపారు. ఈ అవగాహనా కార్యక్రమంలో కాలేజ్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ సి.బాలనారాయణ, ఏఎస్ఐ రాచరాయడు, మహిళా పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

 

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి