Kadapa..సైబర్ క్రైమ్స్‌పై అవగాహన

Authored By praveen T | The Telugu News | Published on: September 7, 2021, 3:51 pm

ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోతున్న సంగతి అందరికీ విదితమే. సైబర్ నేరస్థులు రకరకాల పద్ధతుల్లో ప్రజలను నమ్మించి వారి డబ్బులను కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని వేంపల్లో వైఎస్ఆర్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎస్సై తిరుపాల్ నాయక్ పలు అంశాలపై మంగళవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.

మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన ‘దిశ’ యాప్ గురించి వివరించారు. ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇకపోతే కొవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. టీకా తీసుకున్నా మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించడం మస్ట్ అని తెలిపారు. ఈ అవగాహనా కార్యక్రమంలో కాలేజ్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ సి.బాలనారాయణ, ఏఎస్ఐ రాచరాయడు, మహిళా పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

praveen T

No bio available for this author.

  1. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  2. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  3. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  4. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  5. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

  6. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  7. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp