Home » Andhra Pradesh » World Vision Organisation Distibuted Medical Kits To Secretariat Health Secretaries
andhra pradesh

Krishna.. సచివాలయ కార్యదర్శులకు మెడికల్ కిట్ల పంపిణీ

Authored By
praveen T
The Telugu News | Published on: September 22, 2021, 2:56 pm
Advertisement

వరల్డ్ విజన్ సంస్థ ఆధ్వర్యంలో సచివాలయాల హెల్త్ సెక్రెటరీలకు మెడికల్ కిట్లను జిల్లాలోని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొవిడ్ పాండమిక్ టైం నుంచి మొదలుకుని ఇప్పటి వరకు ముందుండి వారియర్స్‌గా వీరు పోరాడుతున్నట్లు చెప్పారు. కరోనా మహమ్మారి టెస్టింగ్ ప్లస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ, సీజనల్ డిసీజెస్ సర్వే ఇతర ఆరోగ్య శాఖ పనులను సచివాలయ ఆరోగ్య కార్యదర్శులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు సేఫ్టీగా ఉండేందుకుగాను మెడికల్ కిట్లను వరల్డ్ విజన్ సంస్థ వారు పంపిణీ చేశారు.

Advertisement

ఇతరుల ప్రాణాలను కాపాడే ముందర తమ ప్రాణాలు భద్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వారి ఆరోగ్య భద్రత కోసం మెడికల్ కిట్లు ఉపయోగపడనున్నాయి. విజయవాడ సిటీలోని 286 వార్డు సచివాలయ సిబ్బందికి డిజిటల్ ధర్మామీటర్, మాస్కులతో పాటు ఆఫ్రాన్, హిమోగ్లోబిన్ టెస్టింగ్, బీపీ మిషన్‌తో కూడిన మెడికల్ కిట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ గీతాబాయి, వరల్డ్ విజన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

 

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి