Kuppam కుప్పం .. చంద్రబాబు సొంత నియోజకవర్గం. అక్కడ నుంచి వరుసగా ఏడుసార్లు గెలిచారు. కనీసం నామినేషన్ వేయడానికి కూడా వెళ్లకుండానే బాబు గెలిచేస్తున్నారు.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు కుప్పం కోటకు బీటలు అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి 2రౌండ్లు చంద్రబాబు వెనుకబడటం అప్పట్లో సంచలనం అయ్యింది. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు ఘోరంగా ఓడిపోయారు. నియోజకవర్గంలోని 89 పంచాయతీల్లో 74 చోట్ల వైసీపీ గెలిస్తే, 14 పంచాయతీలతో టీడీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పరిషత్ ఎన్నికలను టీడీపీ బాయికాట్ చేసింది. కొన్నిచోట్ల మాత్రం స్థానిక నేతలు పోటీకి దిగారు. కుప్పంలోనూ అదే జరిగింది. నియోజకవర్గంలోని 66 ఎంపీటీసీ స్థానాలలో 44 చోట్ల టీడీపీ అభ్యర్ధులు బరిలోకి దిగారు. వీరిలో ముగ్గురు మాత్రమే గెలిచారు. నాలుగు జడ్పీటీసీలలో అయితే టీడీపీ పోటీకి కూడా ముందుకు రాలేదు. ఇదే ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అయ్యింది.
అధికారంలోకి వచ్చాక కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది వైసీపీ. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో అక్కడ వైసీపీ శ్రేణులు పక్కడ్బందీగా పని చేస్తున్నాయి. రాష్ట్రంలో కంటే ముందు కుప్పంలో చంద్రబాబుకు నిలవడనీడ లేకుండా చేయడానికి పెద్దిరెడ్డి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలను ప్రోత్సహించడం, ప్రభుత్వ పథకాల విషయంలో కాస్త లిబరల్ గా వ్యవహరించడం ద్వారా టీడీపీని బలహీనం చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు పెద్దిరెడ్డి. స్థానికంగా టీడీపీ నేతలపై ఆకర్ష్ అమలు చేయడంలో పెద్దిరెడ్డి సక్సెస్ అయ్యారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఫలితాలు రావడానికి ఈ ఎఫెక్టే కారణమనే అభిప్రాయమూ ఉంది.
ఇక టీడీపీ అంతర్గత విషయాలకు వస్తే, పార్టీ పరిస్థితికి కుప్పం తమ్ముళ్లదే తప్పన్నట్టు చంద్రబాబు మాట్లాడటాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోతోందట. నియోజవర్గంలో చంద్రబాబు ప్రతినిధులుగా ఉన్న మనోహర్, ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులుపై కేడర్ పెద్దఎత్తున ఆరోపణలు చేసింది. మనోహర్ ను తొలగించాలని చంద్రబాబు ముందే కార్యకర్తలు పట్టుబట్టినట్టు సమాచారం. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. అయితే.. ఇది ఈ ఎన్నికల వరకే పరిమితం అవుతుందా? లేక వచ్చే సాధారణ ఎన్నికల వరకు ఉంటుందా? అనే చర్చ నియోజకవర్గంలో నడుస్తోంది. ఎన్నికలను బహిష్కరించకుండా టీడీపీ బరిలోకి దిగితే కుప్పంలో ఫలితాలు ఎలా ఉండేవో ఏమో కానీ పార్టీ తరఫున అంటూ పోటీ చేసిన 44 మంది ఎంపీటీసీ అభ్యర్ధులు ఓడిపోవడం.. చంద్రబాబును పునరాలోచనలో పడేలా చేసిందట.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.