కుంకుడుకాయ Soapnut పంటపై మూడు రోజుల శిక్షణ & ఉచిత మొక్కల పంపిణీ కార్యక్రమం.!
ప్రధానాంశాలు:
కుంకుడుకాయ Soapnut పంటపై మూడు రోజుల శిక్షణ & ఉచిత మొక్కల పంపిణీ కార్యక్రమం.!
కృషి విజ్ఞాన కేంద్రం (KVK), గడ్డిపల్లి, సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల రెండోవ వారంలో షెడ్యూల్డ్ కులాల (SC) రైతులకు కుంకుడుకాయ (సొప్‌నట్) పంటపై మూడు రోజుల ప్రత్యేక శిక్షణ మరియు ఉచిత మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడుతుందని సీనియర్ శాస్త్రవేత్త & హెడ్ (ఇన్‌చార్జి) శ్రీ డి. నరేష్ గారు తెలిపారు.
కుంకుడుకాయ Soapnut పంటపై మూడు రోజుల శిక్షణ & ఉచిత మొక్కల పంపిణీ కార్యక్రమం.!
ఈ కార్యక్రమం ICAR ఆధ్వర్యంలోని CAFRI, జాన్సీ మరియు ICAR- ATARI, హైదరాబాద్ వారి ఆర్థిక సహకారంతో నిర్వహించబడుతుంది.శిక్షణలో కుంకుడుకాయ సాగుకు అనుకూల నేలలు, వాతావరణం, నాటే విధానం, ఎరువుల వినియోగం, నీటిపారుదల, తెగుళ్లు-వ్యాధుల నివారణ, విలువ జోడింపు, మార్కెటింగ్ అవకాశాలపై ప్రాక్టికల్ అవగాహన కల్పించబడుతుంది.
ఉమ్మడి నల్గొండ జిల్లా షెడ్యూల్డ్ కుల (SC) రైతులు అర్హులు. మహిళా రైతులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. పాల్గొన్న రైతులకు ఉచిత శిక్షణ, ఉచిత మొక్కలు, సర్టిఫికేట్, భోజనం మరియు వసతి సౌకర్యం కల్పించబడుతుంది. ఆసక్తి గల రైతులు తమ పేరు, గ్రామం, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.