Jangaon Municipality : జనగామ మున్సిపల్లో కాంగ్రెస్ విజయం ఖాయం: ఎంపీ చామల | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jangaon Municipality : జనగామ మున్సిపల్లో కాంగ్రెస్ విజయం ఖాయం: ఎంపీ చామల

 Authored By ramu | The Telugu News | Updated on :8 February 2026,12:19 am

ప్రధానాంశాలు:

  •  జనగామ మున్సిపల్లో కాంగ్రెస్ విజయం ఖాయం: ఎంపీ చామల

Jangaon Municipality : జనగామ : శనివారం జనగామ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పలు వార్డుల్లో జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షులు లకావత్ ధన్వంతీ, నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ముఖ్యఅతిధులుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ:సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. జనగామ మున్సిపల్లో 20–25 మంది కాంగ్రెస్ అభ్యర్థుల విజయం ఖాయమని అన్నారు.

Jangaon Municipality జనగామ మున్సిపల్లో కాంగ్రెస్ విజయం ఖాయం ఎంపీ చామల

Jangaon Municipality : జనగామ మున్సిపల్లో కాంగ్రెస్ విజయం ఖాయం: ఎంపీ చామల

బీఆర్ఎస్, బీజేపీలు తమ ఓటమి ఖరారైందని గ్రహించి ఉనికికోసం పోరాడుతున్నాయని విమర్శించారు.సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నప్పటికీ ఎన్నికల కోసం ఆ రెండు పార్టీలు రహస్య ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్–బీజేపీలతో అభివృద్ధి సాధ్యం కాదని, గత పదేళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి జరగలేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదల కలలను సాకారం చేస్తున్నామన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది