Chityal Municipality : 07వ వార్డు అభివృద్ధికి పూర్తి భాద్య‌త నాదే : ఎమ్మెల్యే వేముల వీరేశం

 Authored By ramu | The Telugu News | Updated on :8 February 2026,12:50 am

ప్రధానాంశాలు:

  •  Chityal Municipality : 07వ వార్డు అభివృద్ధికి నా సంపూర్ణ బాధ్యత : ఎమ్మెల్యే వేముల వీరేశం

Chityal Municipality : నకిరేకల్ నియోజకవర్గం : చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 07వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి దేశపాలన లత – రాజేశ్ గారి చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ 07వ వార్డును దత్తత తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, డ్రెయినేజీ వ్యవస్థ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రాధాన్యతగా చేపడతామని తెలిపారు.

Chityal Municipality : 07వ వార్డు అభివృద్ధికి పూర్తి భాద్య‌త నాదే : ఎమ్మెల్యే వేముల వీరేశం

Chityal Municipality : 07వ వార్డు అభివృద్ధికి పూర్తి భాద్య‌త నాదే : ఎమ్మెల్యే వేముల వీరేశం

వార్డు అభివృద్ధి బాధ్యత నాదే అని భరోసా ఇచ్చిన ఆయన, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానన్నారు.  ప్రతి కుటుంబానికి ఏదో ఒక సమస్య ఉంది. ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత నాదే అని ప్రజలకు ధైర్యం చెప్పారు.

అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయంను గుర్తు చేశారు. చిట్యాల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని ఎమ్మెల్యే గారు ధీమా వ్యక్తం చేశారు.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి