Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, స్థిరంగా వెండి ధరలు.. ఎంతో తెలుసా?

 Authored By jagadesh | The Telugu News | Updated on :23 September 2022,8:30 am

Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య  ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా పెరుగుతున్నాయో.. బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చాయి బంగారం ధరలు. మొన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిన్న బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు తగ్గాయి. ఇవాళ బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు తగ్గాయి.

08 May 2022 today gold Rates in Telugu states

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4600 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.20 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.46000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.200 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.5020 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.24 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,200 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.240 పెరిగింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,150 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,350 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,240 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200 గా ఉంది. విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.58 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఒక గ్రాము వెండి ధర రూ.58 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.580 కాగా నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.58,000 కాగా నిన్నటి ధరతో పోల్చితే ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.630 కాగా, కిలో వెండి ధర రూ.63000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.580 కాగా, కిలో వెండి ధర రూ.58000 గా ఉంది.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి