5 States Exit Polls : ఐదు రాష్ట్రాల్లో హ‌స్తం వైపు అడుగులు.. మోడీపై వ్య‌తిరేక‌త పెరిగిందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

5 States Exit Polls : ఐదు రాష్ట్రాల్లో హ‌స్తం వైపు అడుగులు.. మోడీపై వ్య‌తిరేక‌త పెరిగిందా..?

5 States Exit Polls : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో ఫలితాల కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. మరి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. అసలు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. రాజస్థాన్ లో ఉన్న మొత్తం స్థానాల సంఖ్య 199. మ్యాజిక్ ఫిగర్ 100. ఇండియా టుడే ప్రకారం బీజేపీకి 80 నుంచి 100 సీట్లు, కాంగ్రెస్ కు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :1 December 2023,8:00 pm

ప్రధానాంశాలు:

  •  రాజస్థాన్ లో అధికారం ఎవరిది?

  •  ఛత్తీస్ గఢ్ లో అధికారం ఎవరిది?

  •  తెలంగాణలో అధికారం ఎవరిది?

5 States Exit Polls : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో ఫలితాల కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. మరి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. అసలు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. రాజస్థాన్ లో ఉన్న మొత్తం స్థానాల సంఖ్య 199. మ్యాజిక్ ఫిగర్ 100. ఇండియా టుడే ప్రకారం బీజేపీకి 80 నుంచి 100 సీట్లు, కాంగ్రెస్ కు 86 నుంచి 106 సీట్లు రానున్నాయి. జన్ కీ బాత్ సర్వే ప్రకారం.. బీజేపీకి 100 నుంచి 122, కాంగ్రెస్ కు 62 నుంచి 85 రానున్నాయి. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. బీజేపీకి 105 నుంచి 125 వరకు రానున్నట్టు తెలుస్తుండగా, కాంగ్రెస్ కు 69 నుంచి 91 వరకు రానున్నట్టు తెలుస్తోంది. టీవీ9 భారత్ వర్ష్, ఈటీజీ ప్రకారం బీజేపీకి 100 నుంచి 110, కాంగ్రెస్ కు 90 నుంచి 100 వరకు రానున్నట్టు తెలుస్తోంది.

ఇక.. ఛత్తీస్ ఘడ్ లో చూసుకుంటే మొత్తం అసెంబ్లీ స్థానాలు 90 కాగా.. మ్యాజిక్ ఫిగర్ 46. ఏబీపీ న్యూస్ సర్వే ప్రకారం బీజేపీకి 36 నుంచి 48 రానున్నట్టు తెలుస్తుండగా, కాంగ్రెస్ కు 41 నుంచి 53, దైనిక్ భాస్కర్ ప్రకారం బీజేపీకి 35 నుంచి 45, కాంగ్రెస్ కు 46 నుంచి 55, ఇండియా టుడే ప్రకారం బీజేపీకి 36 నుంచి 46, కాంగ్రెస్ కు 40 నుంచి 50, ఇండియా టీవీ ప్రకారం బీజేపీకి 30 నుంచి 40, కాంగ్రెస్ కు 46 నుంచి 56, జన్ కీ బాత్ ప్రకారం బీజేపీకి 34 నుంచి 45, కాంగ్రెస్ కు 46 నుంచి 56, రిపబ్లిక్ టీవీ ప్రకారం బీజేపీకి 34 నుంచి 42, కాంగ్రెస్ కు 44 నుంచి 52, టైమ్స్ నౌ ప్రకారం బీజేపీకి 32 నుంచి 40, కాంగ్రెస్ కు 48 నుంచి 56, టీవీ9 భారత్ వర్ష్ ప్రకారం బీజేపీకి 35 నుంచి 45, కాంగ్రెస్ కు 40 నుంచి 50 రానున్నట్టు తెలుస్తోంది.

5 States Exit Polls : తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఇవే

తెలంగాణలో మొత్తం స్థానాలు 119 కాగా, మ్యాజిక్ ఫిగర్ 60. ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ప్రకారం బీఆర్ఎస్ కు 34 నుంచి 47, కాంగ్రెస్ కు 63 నుంచి 79, బీజేపీకి 2 నుంచి 4, ఎంఐఎం కు 5 నుంచి 7. జన్ కీ బాత్ ప్రకారం బీఆర్ఎస్ కు 40 నుంచి 55, కాంగ్రెస్ కు 63 నుంచి 79, బీజేపీకి 2 నుంచి 4, ఎంఐఎంకు 5 నుంచి 7, రిపబ్లిక్ టీవీ మాట్రిజ్ ప్రకారం బీఆర్ఎస్ కు 46 నుంచి 56, కాంగ్రెస్ కు 58 నుంచి 68, బీజేపీకి 4 నుంచి 9, ఎంఐఎంకు 5 నుంచి 7, టీవీ 9 భారత్ వర్ష్ ప్రకారం, బీఆర్ఎస్ కు 48 నుంచి 58, కాంగ్రెస్ కు 49 నుంచి 59, బీజేపీకి 4 నుంచి 9, ఎంఐఎంకు 6 నుంచి 8 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మిజోరాం నుంచి మొత్తం స్థానాలు 40 కాగా, మ్యాజిక్ ఫిగర్ 21. ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ప్రకారం ఎంఎన్ఎఫ్ కు 14 నుంచి 18, జెడ్పీఎం 12 నుంచి 16, కాంగ్రెస్ 8 నుంచి 10, బీజేపీకి 2, జన్ కీ బాత్ ప్రకారం ఎంఎన్ఎఫ్ కి 10 నుంచి 14, జెడ్పీఎంకి 15 నుంచి 25, కాంగ్రెస్ కి 5 నుంచి 9, బీజేపీకి 2 వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్థానాలు ఉండగా, అందులో మ్యాజిక్ ఫిగర్ 116 కాగా.. దైనిక్ భాస్కర్ ప్రకారం బీజేపీకి 95 నుంచి 115, కాంగ్రెస్ కు 105 నుంచి 120, జన్ కీ బాత్ ప్రకారం బీజేపీకి 100 నుంచి 123, కాంగ్రెస్ కు 105 నుంచి 120, న్యూస్ 24 టుడేస్ చాణక్య ప్రకారం బీజేపీకి 151, కాంగ్రెస్ కు 74, రిపబ్లిక్ టీవీ మాట్రిజ్ ప్రకారం బీజేపీకి 118 నుంచి 130, కాంగ్రెస్ కు 97 నుంచి 107 వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది