5 states exit polls released after elections completed
5 States Exit Polls : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో ఫలితాల కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. మరి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. అసలు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. రాజస్థాన్ లో ఉన్న మొత్తం స్థానాల సంఖ్య 199. మ్యాజిక్ ఫిగర్ 100. ఇండియా టుడే ప్రకారం బీజేపీకి 80 నుంచి 100 సీట్లు, కాంగ్రెస్ కు 86 నుంచి 106 సీట్లు రానున్నాయి. జన్ కీ బాత్ సర్వే ప్రకారం.. బీజేపీకి 100 నుంచి 122, కాంగ్రెస్ కు 62 నుంచి 85 రానున్నాయి. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. బీజేపీకి 105 నుంచి 125 వరకు రానున్నట్టు తెలుస్తుండగా, కాంగ్రెస్ కు 69 నుంచి 91 వరకు రానున్నట్టు తెలుస్తోంది. టీవీ9 భారత్ వర్ష్, ఈటీజీ ప్రకారం బీజేపీకి 100 నుంచి 110, కాంగ్రెస్ కు 90 నుంచి 100 వరకు రానున్నట్టు తెలుస్తోంది.
ఇక.. ఛత్తీస్ ఘడ్ లో చూసుకుంటే మొత్తం అసెంబ్లీ స్థానాలు 90 కాగా.. మ్యాజిక్ ఫిగర్ 46. ఏబీపీ న్యూస్ సర్వే ప్రకారం బీజేపీకి 36 నుంచి 48 రానున్నట్టు తెలుస్తుండగా, కాంగ్రెస్ కు 41 నుంచి 53, దైనిక్ భాస్కర్ ప్రకారం బీజేపీకి 35 నుంచి 45, కాంగ్రెస్ కు 46 నుంచి 55, ఇండియా టుడే ప్రకారం బీజేపీకి 36 నుంచి 46, కాంగ్రెస్ కు 40 నుంచి 50, ఇండియా టీవీ ప్రకారం బీజేపీకి 30 నుంచి 40, కాంగ్రెస్ కు 46 నుంచి 56, జన్ కీ బాత్ ప్రకారం బీజేపీకి 34 నుంచి 45, కాంగ్రెస్ కు 46 నుంచి 56, రిపబ్లిక్ టీవీ ప్రకారం బీజేపీకి 34 నుంచి 42, కాంగ్రెస్ కు 44 నుంచి 52, టైమ్స్ నౌ ప్రకారం బీజేపీకి 32 నుంచి 40, కాంగ్రెస్ కు 48 నుంచి 56, టీవీ9 భారత్ వర్ష్ ప్రకారం బీజేపీకి 35 నుంచి 45, కాంగ్రెస్ కు 40 నుంచి 50 రానున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో మొత్తం స్థానాలు 119 కాగా, మ్యాజిక్ ఫిగర్ 60. ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ప్రకారం బీఆర్ఎస్ కు 34 నుంచి 47, కాంగ్రెస్ కు 63 నుంచి 79, బీజేపీకి 2 నుంచి 4, ఎంఐఎం కు 5 నుంచి 7. జన్ కీ బాత్ ప్రకారం బీఆర్ఎస్ కు 40 నుంచి 55, కాంగ్రెస్ కు 63 నుంచి 79, బీజేపీకి 2 నుంచి 4, ఎంఐఎంకు 5 నుంచి 7, రిపబ్లిక్ టీవీ మాట్రిజ్ ప్రకారం బీఆర్ఎస్ కు 46 నుంచి 56, కాంగ్రెస్ కు 58 నుంచి 68, బీజేపీకి 4 నుంచి 9, ఎంఐఎంకు 5 నుంచి 7, టీవీ 9 భారత్ వర్ష్ ప్రకారం, బీఆర్ఎస్ కు 48 నుంచి 58, కాంగ్రెస్ కు 49 నుంచి 59, బీజేపీకి 4 నుంచి 9, ఎంఐఎంకు 6 నుంచి 8 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మిజోరాం నుంచి మొత్తం స్థానాలు 40 కాగా, మ్యాజిక్ ఫిగర్ 21. ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ప్రకారం ఎంఎన్ఎఫ్ కు 14 నుంచి 18, జెడ్పీఎం 12 నుంచి 16, కాంగ్రెస్ 8 నుంచి 10, బీజేపీకి 2, జన్ కీ బాత్ ప్రకారం ఎంఎన్ఎఫ్ కి 10 నుంచి 14, జెడ్పీఎంకి 15 నుంచి 25, కాంగ్రెస్ కి 5 నుంచి 9, బీజేపీకి 2 వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్థానాలు ఉండగా, అందులో మ్యాజిక్ ఫిగర్ 116 కాగా.. దైనిక్ భాస్కర్ ప్రకారం బీజేపీకి 95 నుంచి 115, కాంగ్రెస్ కు 105 నుంచి 120, జన్ కీ బాత్ ప్రకారం బీజేపీకి 100 నుంచి 123, కాంగ్రెస్ కు 105 నుంచి 120, న్యూస్ 24 టుడేస్ చాణక్య ప్రకారం బీజేపీకి 151, కాంగ్రెస్ కు 74, రిపబ్లిక్ టీవీ మాట్రిజ్ ప్రకారం బీజేపీకి 118 నుంచి 130, కాంగ్రెస్ కు 97 నుంచి 107 వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్‌కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
This website uses cookies.