
prabhas salaar part 1 ceasefire official trailer
Prabhas Salaar Part 1 Ceasefire Official trailer : రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. చాలా రోజుల నుంచి ఈ ట్రైలర్ కోసం అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. ఇక వెయిట్ ఈజ్ ఓవర్.. మూవీ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ విడుదలై కొన్ని నిమిషాలు కూడా కాలేదు అప్పుడే మిలియన్ల వ్యూస్ వచ్చాయి అంటే ఈ మూవీ మీద ప్రేక్షకులకు ఎన్ని అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ విడుదలకు ఇంకా 20 రోజుల సమయం ఉంది. తాజాగా ఆ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.
అసలే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న మూవీ కావడం, బాహుబలి స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో హీరో కావడంతో ఈ సినిమాకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. వీళ్ల కాంబోలో మూవీ దద్దరిల్లిపోవాల్సిందే అని ఫ్యాన్స్ అంటున్నారు. ట్రైలర్ చూసి గూస్ బంప్స్ వస్తున్నాయి అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారితే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా కథ. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతోంది. సలార్ టీజర్ లో ప్రభాస్ ఫేస్ ను చూపించలేదు. కానీ.. ట్రైలర్ లో మాత్రం ప్రభాస్ యాక్షన్ మొత్తం చూపించారు. ప్రభాస్ చేసే ఫైట్ సీన్స్ మామూలుగా ఉండవు. ఈ సినిమాలో ప్రభాస్ పేరు దేవా. మలయాళం హీరో పృథ్వీరాజ్ మరో కీలక పాత్రలో నటించాడు. శృతి హాసన్ హీరోయిన్. ఇంకెందుకు ఆలస్యం.. సలార్ ట్రైలర్ పై ఓ లుక్కేయండి మరి.
Mouni Amavasya : మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తారు. హిందూ సంప్రదాయాల్లో ఈ తిథికి విశేషమైన…
Zodiac Signs January 18 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
Kavitha : ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో చర్చనీయాంశంగా మారుతూనే…
Mana Shankara Vara Prasad Garu Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్…
Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే…
Smart TV : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? కానీ ఎక్కువ ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే…
Kethireddy Peddareddy : తాడిపత్రిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,…
Medaram Jatara 2026 : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా…
This website uses cookies.