Aadhaar Card : సరికొత్త బిల్లుకు పార్లమెంట్ ఆమోదం…ఇకపై జనన మరణాలకు ఆధార్ తప్పనిసరి..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 7 April 2024, 5:00 pm

Aadhaar Card  : రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఆధార్ కార్డు ధ్రువీకరణను ప్రవేశపెడుతూ జనన మరియు మరణాల చట్టాన్ని సవరించే బిల్లును ఇటీవల పార్లమెంటు ఆమోదించడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు అర్ధరాత్రి నుండి ఈ చట్టం అమల్లోకి రానుండగా దేశంలో జనన మరియు మరణాల నమోదు ప్రక్రియలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునున్నట్లు తెలుస్తోంది.అయితే గతం లో జనన మరియు మరణాల నమోదు సమయంలో ఆధార్ కార్డు ధ్రువీకరణ అవసరం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం సవరించిన బిల్ రిజిస్ట్రేషన్ లో భాగంగా జనన మరియు మరణాల ధ్రువీకరణకు ఆధార్ తప్పనిసరి చేస్తూ పార్లమెంట్ ఆమోదించడం జరిగింది.

Aadhaar Card : ఆధార్ తప్పనిసరి…

తద్వారా మరింత పటిష్టమైనఅలాగే విశ్వసనీయమైన డేటా ఆఫీస్ ను నిర్ధారించవచ్చు.అయితే పార్లమెంటు ఆమోదించిన ఈ సవరణ ద్వారా2023 లేదా ఆ తర్వాత జన్మించిన పిల్లలు ఎక్కువ మొత్తంలో ప్రయోజనాలు పొందనన్నారు. ఎందుకంటే జనన నిర్ధారణకు ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో ఆధార్ కార్డుతో వారి యొక్క జనన ధ్రువీకరణ పత్రం , పాఠశాల అడ్మిషన్లు ,డ్రైవింగ్ లైసెన్స్ ,వివాహాలకు నమోదు ,ప్రభుత్వ ఉద్యోగ ప్రయోజనాలను పొందడం వంటి ప్రక్రియలను సులభతరంగా చేసుకోగలరు.అయితే పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించడానికి ప్రధాన లక్ష్యం జనన మరియు మరణాల కోసం జాతీయ లేదా రాష్ట్రస్థాయి డేటా బేస్ సేకరణను క్రమబద్ధీకరించడం.

Aadhaar Card : సరికొత్త బిల్లుకు పార్లమెంట్ ఆమోదం...ఇకపై జనన మరణాలకు ఆధార్ తప్పనిసరి..!

Aadhaar Card : సరికొత్త బిల్లుకు పార్లమెంట్ ఆమోదం…ఇకపై జనన మరణాలకు ఆధార్ తప్పనిసరి..!

Aadhaar Card  : బిల్ ఆమోదించడానికి ప్రధాన లక్ష్యం…

ఇక ఈ బిల్లులో అవసరమయ్యే మార్పులను చేర్చేందుకు ప్రజాప్రతినిధులు ,వాటాదారులతో చర్చలు జరపడం యొక్క ప్రాముఖ్యతను కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలియజేశారు. ఈ సంప్రదింపుల కారణంగా ఆందోళనలను పరిష్కరించవచ్చని అలాగే ప్రజలు అనేక రకాల ప్రయోజనాలను పొందెందుకు ఉపయోగపడేలా దీనిని తీసుకురావడం జరుగుతుంది.అయితే ఈ జనన మరియు మరణ నమోదు సవరణ బిల్లును ఆమోదించడం ద్వారా డేటా సమగ్రత పెంపొందించే ఒక ముఖ్యమైన దశను సూచించారు. ఈ క్రమంలోనే ఆధార్ కార్డు ధృవీకరణతో వివిధ రంగాల మరియు సేవలలో ప్రజలు ప్రయోజనం పొందే విధంగా ఈ వ్యవస్థను రూపొందించాలనికేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp