UIDAI : పిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ఇక స్కూళ్లలోనే ఆధార్ అప్‌డేషన్..!
ప్రధానాంశాలు:
పిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ఇక స్కూళ్లలోనే ఆధార్ అప్‌డేషన్..!
UIDAI : పిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ఇక స్కూళ్లలోనే ఆధార్ అప్‌డేషన్..!
UIDAI : దేశవ్యాప్తంగా ఐదేళ్లు దాటిన తర్వాత ఆధార్ కార్డును అప్‌డేట్ చేయించని చిన్నారుల సంఖ్య ఏడున్నర కోట్లకు పైగా ఉందని UIDAI పేర్కొంది. పిల్లలకు చిన్నతనంలో బాల ఆధార్ తీసుకుంటున్నప్పటికీ, 5 ఏళ్లు దాటి తర్వాత అప్‌డేట్ చేయకపోవడం వల్ల ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. 5 నుంచి 7 ఏళ్ల మధ్య వయస్సు గల చిన్నారులకు ఉచితంగా ఆధార్ అప్‌డేషన్ అవకాశం ఉన్నప్పటికీ, పెద్దగా స్పందన లేకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని UIDAI ఈ కొత్త నిర్ణయం తీసుకుంది.

UIDAI : పిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ఇక స్కూళ్లలోనే ఆధార్ అప్‌డేషన్..!
UIDAI : గుడ్ న్యూస్ .. ఆధార్ కార్డు అప్‌డేషన్ కోసం రూపాయి కూడా ఇవ్వనక్కర్లేదు
ఈ సమస్యకు పరిష్కారంగా UIDAI స్కూళ్లలోనే ఆధార్ అప్‌డేషన్ చేయించే విధంగా ఓ ప్రాజెక్టును ప్రారంభించింది. స్కూల్‌లోనే బయోమెట్రిక్ అప్‌డేషన్ ప్రక్రియను అమలు చేసి, తల్లిదండ్రులు ప్రభుత్వ కార్యాలయాలు తిరగాల్సిన అవసరం లేకుండా చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో అమలు చేయడానికి బయోమెట్రిక్ యంత్రాలను పంపించనున్నట్లు UIDAI సీఈవో భువనేశ్ కుమార్ తెలిపారు. ఆధార్ అప్‌డేట్ చేయడం వల్ల పిల్లలు ప్రభుత్వం అందించే పథకాలన్నింటినీ సమయానికి పొందగలగుతారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా స్కూళ్లకు బయోమెట్రిక్ యంత్రాలను పంపిణీ చేసి, ప్రతి విద్యాసంస్థలో ఈ ప్రక్రియను అమలు చేయనున్నట్లు చెప్పారు. అవసరమైన సాంకేతిక సదుపాయాలపై పరీక్షలు జరుగుతున్నాయని, రాబోయే 45–60 రోజుల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఇదే విధానాన్ని 15 ఏళ్లు దాటిన పిల్లల ఆధార్ అప్‌డేట్‌కి కూడా కాలేజీల ద్వారా అమలు చేయాలని UIDAI యోచిస్తున్నది. ఇది ఒక స్మార్ట్ అడుగు కావడమే కాకుండా, ఆధునికత వైపు దేశ విద్యా వ్యవస్థలో గొప్ప మార్పుకు నాంది అవుతుంది.