Bal Jeevan Bhima Yojana : కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాల కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చి ప్రజలను ఆదుకుంటున్నారు. ఇప్పుడు పిల్లల కోసం బాల్ జీవన్ బీమా యోజన అనే పథకంతో మన ముందుకి వచ్చారు. దేశంలోని పిల్లలందరూ భవిష్యత్తును సురక్షితంగా ఉజ్వలంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం బాల్ జీవిన్ బీమా స్కీముని మొదలుపెట్టారు. ఈ స్కీం ద్వారా ఒక సాధారణ పౌరుడు రోజుకి 6 రూపాయలు పెట్టుబడి పెడితే చాలు.. మరియు భవిష్యత్తులో లక్షల రూపాయల విలువైన ప్రయోజనాలను అందుకోవచ్చు.. ప్రయోజనం ఎలా పొందాలి. అర్హత అవసరమైన పత్రాలు గురించి పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం… ఈ పెట్టుబడి డబ్బులు తమ పిల్లల చదువులు, వివాహం మరియు ఇతర అవసరాల కోసం వినియోగించవచ్చు.. ప్రతి వ్యక్తి కొద్దిగా పెట్టుబడి తప్పకుండా పెట్టాలి..
చిన్నపిల్లల ఇన్సూరెన్స్ పథకంలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద పోస్ట్ ఆఫీస్ నిర్వహిస్తోంది. పిల్లల మెరుగైన జీవితం మెరుగైన ఎదుగుదల మరియు భవిష్యత్తు కోసం ఈ బీమా చాలా అవసరం.. ఈ స్కీం కింద 5 నుండి 20 సంవత్సరాల మధ్య పిల్లలకు బీమా చేసుకోవచ్చు.. పిల్లల తల్లిదండ్రులు వయసు 40 సంవత్సరాలు కంటే అధికంగా ఉంటే వారు ఈ స్కీం కి దరఖాస్తు చేయడానికి నామిని గా ఉంచుతారు. బీమా తీసుకున్న తర్వాత తల్లిదండ్రులు మరణిస్తే బీమా చెల్లించాల్సిన అవసరం ఉండదు. పదవి కాలం ముగిసిన తర్వాత బీమా మొత్తం పూర్తిగా బిడ్డకి ఇవ్వబడుతుంది. అలాగే పోస్ట్ ఆఫీస్ లో PPF,NSC,FD లలో అకౌంట్ ను తిరగడం ద్వారా మీరు మంచి వడ్డీని అందుకోవచ్చు.. ఆఫ్లైన్/ ఆన్లైన్ అప్లికేషన్ సౌకర్యం దరఖాస్తు సౌకర్యం అందుబాటులో ఉంటుంది…
ఈ బీమా కింద మీరు రోజు వారి నెలవారి మరియు వార్షికంగా ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు.. ఈ స్కీం కింద ఒక సాధారణ పౌరుడు రోజుకి 6 నుండి 18 రూపాయలు చెల్లించవచ్చు.. బిడ్డ పాలసీ తీసుకున్న తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు మరణిస్తే బీమా మొత్తం బిడ్డకి చెల్లిస్తారు.. బీమా తెలుసుకునేటప్పుడు బిడ్డ చనిపోతే నామినీకి లేదా పాలసీదారునికి చెల్లింపు జరుగుతుంది. ఈ స్కీం కింద బీమా పొందడం వలన పిల్లల మెరుగైన జీవితం కోసం ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వివాహం, కళాశాల, విద్య అలాగే ఇతర ముఖ్యమైన పనులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మరిన్ని ఉపయోగాలను పొందడానికి మీరు రోజుకి కేవలం 50 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా 31 నుంచి 35 లక్షల రూపాయల ప్రయోజనాలను అందుకోవచ్చు..
-మొబైల్ నెంబర్..
-పిల్లల పాస్పోర్ట్ సైజ్ ఫోటో..
-పిల్లలజనన ధ్రువీకరణ పత్రం..
-చిరునామా రుజువు.. *తల్లిదండ్రుల ఆధార కార్డు..
-పిల్లల ఆధార్ కార్డు..
బాల్ జీవన్ బీమా యోజన కింద అప్లికేషన్ ప్రక్రియ; జీవిత బీమా ప్రయోజనాన్ని పొందడానికి ముందుగా పిల్లల తల్లిదండ్రులు తమ ప్రాంతంలోని సమీపంలో పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళాలి.. అక్కడికి వెళ్లిన తర్వాత మీరు అధికారి నుండి పిల్లల జీవిత బీమా స్కీమ్ కోసం అప్లికేషన్ ఫామ్ ను తీసుకోవాలి. పిల్లల పేరు వయసు చిరునామా నామిని మరియు దరఖాస్తు ఫామ్ లో అడిగిన అన్ని ఇతర సమాచారాలను సరిగ్గా పూరించాలి. దాని తర్వాత ఫామ్ లో అడిగిన అవసరమైన పత్రాలను ఫామ్ తో జత చేయాలి. దీని తర్వాత ఫామ్ ని పోస్ట్ ఆఫీస్ కు సమర్పించాలి. అన్ని పత్రాలను నిర్ధారణ చేసుకున్న తర్వాత మీరు కార్యాలయం నుండి పాస్ బుక్ అందుకుంటారు. ఇది మీరు డిపాజిట్ చేసిన బీమా మొత్తాన్ని ఇందులో చూపిస్తుంది. ఈ విధంగా మీరు మీ పిల్లల జీవిత బీమా స్కీం కోసం ఈజీగా అప్లికేషన్ చేయవచ్చు..
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
This website uses cookies.