పొరపాటున కారు డ్రైవర్ ఖాతాలో 9 వేల కోట్లు జమ చేసిన బ్యాంక్ అధికారులు .. ఆ తర్వాత ఏమైందంటే ??
ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన ఓ బ్యాంక్ అధికారులు పొరపాటున ఓ కారు డ్రైవర్ ఎకౌంట్లోకి 9,000 కోట్లు జమ చేశారు. ఈ న్యూస్ రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయింది. అనుకోకుండా బ్యాంక్ అధికారులు కారు డ్రైవర్ ఖాతాలోకి కోట్లాది రూపాయలను జమ చేశారు. దీంతో కారు డ్రైవర్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి అయ్యాడు. అన్ని వేల కోట్లు తన ఖాతాలోకి రావడంతో షాకింగ్ కి గురయ్యాడు. అయితే కొద్ది సమయంలోనే ఆ తొమ్మిది వేల కోట్లను బ్యాంక్ అధికారులు వెనక్కి తీసేసుకున్నారు.
చెన్నైకి చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈనెల తొమ్మిది న అతడి సెల్ ఫోన్ కి తమిళనాడు మార్కంటైల్ బ్యాంకు నుంచి తన ఖాతాలో 9000 కోట్లు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆ కారు డ్రైవర్ అది నిజమో కాదో తెలుసుకోవాలని తన స్నేహితుడికి 21,000 ట్రాన్స్ఫర్ చేశాడు. వెంటనే బ్యాంకు అధికారులు రాజ్ కుమార్ కి ఫోన్ చేసి పొరపాటున మీ ఖాతాలోకి 9,000 కోట్లు బదిలీ అయ్యాయని చెప్పారు. అలాగే తన స్నేహితుడికి పంపిన 21000 తో పాటు మొత్తం సొమ్మును తిరిగి బ్యాంకుకు అందించాలని అన్నారు.
దీంతో రాజ్ కుమార్ న్యాయవాదులను సంప్రదించగా ఆ న్యాయవాదులు వెళ్లి బ్యాంక్ అధికారులతో మాట్లాడగా 21000 వెనక్కి ఇవ్వాల్సిన పనిలేదని, పైగా వాహన రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో కథ సుఖాంతం అయింది. దీంతో ఈ న్యూస్ దేశమంతటా వైరల్ గా మారింది. ఈ న్యూస్ పై నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేశారు. మొత్తానికి అయితే బ్యాంక్ అధికారులు చేసిన పొరపాటు వలన ఇంత కథ నడిచింది వేరే ఖాతాలోకి జమ చేయబోయి ఇలా కారు డ్రైవర్ ఖాతాలోకి జమ చేశారు. మొత్తానికి అయితే ఈ న్యూస్ దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది.