bengaluru youth commits suicide after lover breakup
Crime News : ప్రేమ అనేది నిండు నూరేళ్లు అలాగే కంటిన్యూ అవ్వాలంటే అది ఖచ్చితంగా ఇద్దరి నుంచి సపోర్ట్ ఉండాలి. ఇద్దరిలో ఏ ఒక్కరి నుంచి సపోర్ట్ లేకున్నా అది మధ్యలోనే ఆగిపోతుంది. ముఖ్యంగా తెలిసీ తెలియని వయసులో యూత్ ఎక్కువగా ప్రేమలో పడుతుంటారు. ప్రేమలో పడిన తర్వాత సరైన అవగాహన లేక.. మెచ్యూరిటీ లేక కొందరు మళ్లీ విడిపోతుంటారు. కొందరు పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత కష్టపడుతుంటారు.
bengaluru youth commits suicide after lover breakup
అయితే.. ప్రేమలో ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటాం. కానీ.. నిజ జీవితంలోనూ ప్రేమలో చాలా కష్టాలు ఉంటాయి. కొందరు నిజాయితీగా ప్రేమిస్తారు. ఆ తర్వాత ప్రేమించిన వాళ్లు దూరం అయితే తట్టుకోలేరు. కొందరు చివరకు ప్రాణాలు తీసుకునే వరకు కూడా వెళ్తారు. అలాంటి ఘటనే ఒకటి బెంగళూరులో చోటు చేసుకుంది. 25 ఏళ్ల రోహిత్, ఓ యువతి గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
అయితే.. ఆరేళ్లుగా ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకున్న సమయంలో… రోహిత్ కు, తన ప్రియురాలికి గొడవ జరిగింది. దీంతో ఆ యువతి ఆవేశంతో అతడికి బ్రేకప్ చెప్పింది. వదిలేసి వెళ్లిపోయింది. ఏదో కొన్ని రోజులే కావచ్చు.. మళ్లీ మాట్లాడుతుందిలే అని అనుకున్నాడు కానీ.. ఆ యువతి అతడితో మాట్లాడటం మానేసింది. దీంతో రోహిత్ తట్టుకోలేకపోయాడు. చాలాసార్లు బతిమలాడాడు కానీ… ఆ యువతి అస్సలు పట్టించుకోలేదు. దీంతో తన ప్రియురాలు లేని జీవితం వేస్ట్ అనుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Milk :ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆరోగ్యాన్ని అందించాలని ఎన్నో రకాల పోషకాలు కలిగిన ఆహారాలను అందిస్తూ ఉంటారు.…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో పెంచకూడదు. ఒక వేల పెంచినట్లయితే ఆ ఇంట్లో…
Hari Hara Veera Mallu Movie Review : ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నుంచి Pawan Kalyan పవన్…
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan సినిమా ప్రమోషన్స్ కి ఎప్పుడూ దూరంగా ఉంటారు.…
Local Election : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వేగంగా అడుగులు వేస్తోంది.…
Hari Hara Veera Mallu First Review : Hari Hara Veera Mallu Movie Review పవర్ స్టార్…
హైదరాబాద్, ఇప్పటివరకు సొంత ఇల్లు కలగన్నా… ఆ కలను నిజం చేసుకోవడం సాధ్యపడలేదా? ఇప్పుడు మీ ఆలోచనలకు గమ్యం చేరే…
Wife : నంద్యాల జిల్లాలో భర్తను భార్య దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. రమనయ్య…
This website uses cookies.