Crime News : ఆరేళ్లు ప్రేమించుకున్నారు.. ఆ తర్వాత ప్రేయసి చేసిన పనికి షాక్ అయిన ప్రియుడు ఏం చేశాడంటే?

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 20 January 2023, 8:30 am

Crime News : ప్రేమ అనేది నిండు నూరేళ్లు అలాగే కంటిన్యూ అవ్వాలంటే అది ఖచ్చితంగా ఇద్దరి నుంచి సపోర్ట్ ఉండాలి. ఇద్దరిలో ఏ ఒక్కరి నుంచి సపోర్ట్ లేకున్నా అది మధ్యలోనే ఆగిపోతుంది. ముఖ్యంగా తెలిసీ తెలియని వయసులో యూత్ ఎక్కువగా ప్రేమలో పడుతుంటారు. ప్రేమలో పడిన తర్వాత సరైన అవగాహన లేక.. మెచ్యూరిటీ లేక కొందరు మళ్లీ విడిపోతుంటారు. కొందరు పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత కష్టపడుతుంటారు.

bengaluru youth commits suicide after lover breakup

bengaluru youth commits suicide after lover breakup

అయితే.. ప్రేమలో ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటాం. కానీ.. నిజ జీవితంలోనూ ప్రేమలో చాలా కష్టాలు ఉంటాయి. కొందరు నిజాయితీగా ప్రేమిస్తారు. ఆ తర్వాత ప్రేమించిన వాళ్లు దూరం అయితే తట్టుకోలేరు. కొందరు చివరకు ప్రాణాలు తీసుకునే వరకు కూడా వెళ్తారు. అలాంటి ఘటనే ఒకటి బెంగళూరులో చోటు చేసుకుంది. 25 ఏళ్ల రోహిత్, ఓ యువతి గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

Crime News : బ్రేకప్ చెప్పడంతో తట్టుకోలేకపోయిన ప్రియుడు

అయితే.. ఆరేళ్లుగా ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకున్న సమయంలో… రోహిత్ కు, తన ప్రియురాలికి గొడవ జరిగింది. దీంతో ఆ యువతి ఆవేశంతో అతడికి బ్రేకప్ చెప్పింది. వదిలేసి వెళ్లిపోయింది. ఏదో కొన్ని రోజులే కావచ్చు.. మళ్లీ మాట్లాడుతుందిలే అని అనుకున్నాడు కానీ.. ఆ యువతి అతడితో మాట్లాడటం మానేసింది. దీంతో రోహిత్ తట్టుకోలేకపోయాడు. చాలాసార్లు బతిమలాడాడు కానీ… ఆ యువతి అస్సలు పట్టించుకోలేదు. దీంతో తన ప్రియురాలు లేని జీవితం వేస్ట్ అనుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp