Lok Sabha and AP Elections : ఈసారి దేశం అత్యంత కీలకమైన ఎన్నికలను ఎదుర్కొంటుంది. ప్రతి ఎన్నిక కీలకమైనది. అయితే ఈసారి ఇంకా కీలకం అని అంటున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి గెలవాలని ఉరకలేస్తున్నారు. తమకు 370 సీట్లు వస్తాయని చెబుతున్నారు. ఇక మరోవైపు ప్రతిపక్షాలు ఇండియా పేరిట కూటమికట్టి మోడీని దించేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఇక మరోవైపు ఏపీ వంటి కీలక రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి తమదే అధికారం అని అంటుంది. ఇక వైయస్ జగన్ వైసీపీ పార్టీని దెబ్బ కొట్టాలని టీడీపీ, జనసేన కూటమి భావిస్తుంది. అందుకనే ఈసారి సార్వత్రిక ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. మరోవైపు కేంద్రంలో ఈసారి ఏర్పడే ప్రభుత్వాన్ని బట్టి వివిధ రాష్ట్రాల్లో సమీకరణాలు మారతాయని చెప్పవచ్చు.
2019లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మార్చి 9 న విడుదలైంది. ఈసారి కూడా ఇదే నెలలో రావడం ఖాయం అని తెలుస్తుంది. అయితే కచ్చితంగా చెప్పుకున్నప్పటికీ మార్చి 9న షెడ్యూల్ వెలువడుతుందని జాతీయ మీడియా చెబుతోంది. అంటే గతంలో ఒక కంటే ఒక రోజు ముందు అని. కేంద్ర ఎన్నికల సంఘం తమ ప్రయత్నాలను దాదాపుగా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. లోక్ సభ పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కొన్ని రోజులుగా ఎన్నికల సంఘం పర్యటనలు చేస్తోంది. ఆయా చోట్ల సన్నాహాలను పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే గత శనివారం ఒడిశా వెళ్లిన ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు రాష్ట్రాల్లోని అధికారులతో సమావేశం అయినాకే ఈ మేరకు చెప్పే వీలుంటుంది.
అందుకని అధికారులు షెడ్యూల్ దాదాపు ఖరారు చేసినట్లు చెబుతున్నారు. 2019లో మార్చి 10న షెడ్యూల్ విడుదలైంది. నాడు ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు జరిగాయి. మొత్తం ఏడు దశలకు తొలి దశలోనే ఏప్రిల్ 11న ఏపీలో పోలింగ్ జరిగింది. చివరి దశగా మే 19 వరకు దేశంలో ఏడు దశల్లో పోలింగ్ జరగక మే 23న ఫలితాలు వెలువడ్డాయి. మరి ఇప్పుడు ఒకరోజు ముందుగా షెడ్యూల్ వస్తుంది. పోలింగ్, ఫలితాల వెల్లడి ఎన్ని దశల్లో ఎన్నికలు జరగవుతాయి అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈసారి లోక్ సభ తో పాటు ఏపీ ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు మే లోగా ఎన్నికలు జరగాలి. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అధికారులతో ఎన్నికల సంఘం సమావేశం కానుంది. మార్చి 12 , 13 తేదీల్లో కాశ్మీర్లో ఎన్నికల సంఘం పర్యటించనుంది. లోక్ సభ తో పాటు అక్కడ అసెంబ్లీకి ఎన్నికలకు అంచనాకు రానుంది. ఒకవేళ ఇలా అయితే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెల్లడి మార్చి రెండో వారంలోకి వెళుతుంది.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.