Aadhaar Card : ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి కేంద్రం ఊరట… నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బు జమ…!
ప్రధానాంశాలు:
Aadhaar Card : ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి కేంద్రం ఊరట... నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బు జమ...!
Aadhaar Card : భారతదేశం పురోగతి సాధిస్తున్నప్పటికీ…ఇప్పటికీ విస్తృతమైన పేదరికం మరియు శ్రామిక వర్గాలు సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే చాలామంది వారి కుటుంబాలకు తగిన ఉపాధి దొరక ఇబ్బందులు పడుతున్నారు. అయితే దారిద్రపు రేఖకు దిగువన ఉన్నవారిని అలాగే కార్మిక వర్గం దీనస్థితిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయాన్ని అందించే దిశగా కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. ఇక ఈ పథకాలలో ఇష్రామ్ పోర్టల్ పథకం కూడా ఒకటి. మరి ముఖ్యంగా కార్మికులకు లబ్ధి చేకూర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు కలిగియున్న ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి ఈ పథకం ద్వారా రూ.1000 ఇవ్వనుంది.
Aadhaar Card : ఎలా దరఖాస్తు చేసుకోవాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇష్రామ్ పోర్టల్ నుండి ప్రయోజనాలు పొందేందుకు కార్మికులు ilababla పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దాదాపు 14 కోట్ల మంది దీనికి దరఖాస్తు సమర్పించారు. ఇక ఈ పథకం ద్వారా అదనంగా ప్రమాద బీమా కవరేజీ రూ.2 లక్షలు కూడా పొందవచ్చు.అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం కార్మికులకు కాస్త ఉపశమనం కలిగిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని మొబైల్ ఫోన్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు. అయితే దీని ద్వారా సహాయాన్ని పొందేందుకు వ్యక్తులు తప్పనిసరిగా ఇష్రామ్ పోర్టల్ ద్వారా ఇష్రామ్ కార్డుకు అప్లై చేయాలి. నమోదు చేసుకున్న తర్వాత లబ్ధిదారులు వారి యొక్క ఫోన్ నెంబర్ ను ఈ పోర్టల్ కి లింకు చేసుకోవాలి. అనంతరం నోటిఫికేషన్ స్వీకరించడం ద్వారా ఈ పథకం నుండి లబ్ది పొందే చెల్లింపులను మీరే స్వయంగా తనిఖీ చేసుకోవచ్చు.
Aadhaar Card పథకం యొక్క లక్ష్యం…
కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా నేరుగా ఆర్థిక సహాయం మరియు బీమా కవరేజీ ని కార్మికులకు అందించి వారి ఆర్థిక ఇబ్బందులను తగ్గించడమే ప్రధాన లక్ష్యం గా
పెట్టుకొని పని చేస్తుంది.