New Scheme : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం గురించి మీకు తెలుసా… ఒక్కొక్కరికి 2 లక్షలు…!
ప్రధానాంశాలు:
New Scheme : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం గురించి మీకు తెలుసా... ఒక్కొక్కరికి 2 లక్షలు...!
New Scheme : దేశ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను తీసుకొస్తున్నప్పటికీ ప్రజలకు వాటిపై పూర్తి అవగాహన ఉండడం లేదు. వందల సంఖ్యలో పథకాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని సక్రమంగా ప్రచారం చేయకపోవడంతో ప్రజలు ఆ పథకాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఇక అలాంటి పథకం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం.
New Scheme : ప్రధానమంత్రి ఈ శ్రమ్ యోజన…
అయితే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది. ఇక ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశంలోని 38 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు అందజేస్తుంది. దీనిలో భాగంగా భవన నిర్మాణ కార్మికులు , వలస కార్మికులు ,ప్లాట్ ఫారమ్ కార్మికులు , వీధి వ్యాపారులు ,గృహ కార్మికులు వ్యవసాయ కార్మికులు , ట్రక్ డ్రైవర్లు , మత్స్యకారులు , అందరూ కూడా ఈ పథకానికి అర్హులవుతారు. ఇక ఈ పథకానికి నమోదు చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం 12 అంకెల ఈ కార్డును ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ కార్డు అనేది దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. అలాగే కార్మికుల గణాంకాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఈ శ్రమ్ కార్డును ఆధార్ తో లింక్ చేస్తుంది. తద్వారా అర్హులైన వారందరూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు..
New Scheme : అర్హత…
అయితే ఈ శ్రమ్ అర్హత పొందాలంటే కార్మికుల వయసు 15 నుండి 59 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా కార్మికులు ఆదాయపు పన్ను చెల్లింపు దారులుగా ఉండకూడదు. అంటే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పేదల కోసం తీసుకువచ్చింది కాబట్టి పేదలకు పన్నులు చెల్లించేంత ఆదాయం ఉండదు. అదేవిధంగా కార్మికులు EPFO , ESIC సభ్యులుగా ఉండకూడదు.
New Scheme : ప్రయోజనాలు ఏంటంటే…
అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ కార్డ్ పథకానికి నమోదు చేసుకున్నవారు కేంద్ర ప్రభుత్వం అందించే సామాజిక పథకాల కోసం ప్రత్యేకంగా మరోసారి నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే ఈ పథకం కింద లబ్ధిదారులు ప్రమాద బీమా కూడా పొందుతారు. ఇది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 365 రోజుల పాటు కొనసాగుతుంది. అంటే ప్రమాదవశాత్తు కార్మికుడు మరణించిన లేదా వికలాంగుడు అయిన ఈ పథకం ద్వారా చనిపోయిన కార్మికుడి కుటుంబ సభ్యులకు 2 లక్షలు, అంగవైకల్యం ఏర్పడిన కార్మికుడి కుటుంబానికి లక్ష పరిహారం అందిస్తారు.
రిజిస్ట్రేషన్ కు కావలసిన పత్రాలు…
ఈ శ్రమ్ కార్డ్ పోర్టల్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే పేరు, వృత్తి , శాశ్వత చిరునామా, విద్యార్హత వివరాలు, నైపుణ్యాలు ,అనుభవ వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు ,ఆధార్ నెంబర్ , ఆధార్ తో లింక్ చేయబడిన మొబైల్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్ , ఖాతా హోల్డింగ్ బ్యాంకు యొక్క ఐఎఫ్ఎస్సీ కోడ్ కలిగి ఉండాలి. ఈ వివరాల ద్వారా మీరు ఈ పార్టెల్ లో నమోదు చేసుకోవచ్చు.
ఎలా నమోదు చేసుకోవాలంటే…
దీనికి నమోదు చేసుకోవాలి అనుకునేవారు మీ సమీప ప్రాంతంలో గల మీసేవ కేంద్రానికి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.