7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా బంపర్ ఆఫర్.. భారీగా పెరగనున్న డీఏ.. ఎంతో తెలుసా?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి సందర్భంగా త్వరలో బంపర్ ఆఫర్ ప్రకటించే అవకాశం ఉంది. పండుగ సీజన్ కావడంతో డీఏను త్వరలోనే పెంచుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏను పెంచుతుంది. ఈసంవత్సరం జనవరిలో పెరగాల్సిన డీఏ.. మార్చిలో పెరిగింది. మళ్లీ జులైలో పెరగాల్సి ఉంది కానీ.. పెరగలేదు. దసరా సందర్భంగా త్వరలోనే పెరిగే అవకాశం ఉంది. అది కూడా త్వరలోనే నరేంద్ర మోదీ కేబినేట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. డీఏ, డీఆర్ పెంపుపై నిర్ణయం తీసుకోగానే వెంటనే ప్రకటించే అవకాశం ఉంది.
డీఏను మరో 4 శాతానికి పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కానీ.. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం రేటు, సీపీఐ ఇండెక్స్ రేటును దృష్టిలో పెట్టుకొని డీఏను 3 శాతం వరకు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 15 నుంచి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 24న దసరా పండుగ ఉంది. ఈనేపథ్యంలో డీఏ పెంపుపై ఖచ్చితంగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా.. జులై 1, 2023 నుంచే డీఏ పెంపు అమలు కానుంది. డీఏ బకాయిలను కూడా కేంద్రం చెల్లించనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా 4 శాతం డీఏ పెంపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం డీఏ, డీఆర్ 42 శాతం అందిస్తున్నారు. మరో 4 శాతం పెరిగితే అది 46 శాతం అవుతుంది.

#image_title
7th Pay Commission : డీఏను ఎలా లెక్కిస్తారు?
డీఏను ప్రస్తుతం ఉన్న సీపీఐ ఐడబ్ల్యూ ఇండెక్స్ ప్రకారం లెక్కిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం డీఏను ఇస్తుంది. ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏను కేంద్రం పెంచుతుంది. మార్చి 2023 లో డీఏను పెంచారు. అప్పుడు 38 శాతంగా ఉన్న డీఏను 42 శాతానికి పెంచారు.