వలస పాలనకు గుర్తుగా .. 124 ఏ చట్టం : సీజేఐ ఎన్వీ రమణ
CJI NV Ramana వలసపాలననాటి చట్టాలు ఇంకా అమలు చేస్తుండటంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. స్వాతంత్ర పోరాటాన్ని అణచివేయడానికి బ్రిటీషు పాలకులు ఉపయోగించిన సెక్షన్ 124 ఏ ను ఇంకా ఎందుకు రద్దు చేయలేదని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ సెక్షన్దు ర్వినియోగమవుతున్న తీరుపై జస్టిస్ ఎన్వీ రమణ CJI NV Ramana నేతృత్వంలోని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజల ప్రాథమిక హక్కు అయిన మాట్లాడే హక్కును కాలరాస్తున్న ఈ సెక్షన్ చట్టబద్దతను సవాలు చేస్తూ.. రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్‌జీ వోంబాట్కేర్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ రాజద్రోహ చట్టం స్వాతంత్రోద్యమాన్ని అణచివేసేందుకు బ్రిటీషర్లు తీసుకువచ్చారు. మహాత్మాగాంధీ లాంటి స్వాతంత్ర పోరాట యోధుల గొంతు నొక్కటానికి ఈ చట్టాన్ని ఉపయోగించారని ధర్మాసనం గుర్తు చేసింది. దీనిపై అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ స్పందిస్తూ ఈ చట్టం దుర్వినియోగం కాకుండా కొన్ని మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

CJI Ramana stands for liberty Section 124A
CJI NV Ramana 124 ఏ రద్దు చేయాల్సిందే.. Section 124A
‘ఒక వడ్రంగి తను చేయదలుచుకున్న వస్తువు కోసం ఒకచెట్టును నరకడానికి బదులుగా అడవంతా నరికితే ఎలా ఉంటుందో.. ఈ చట్టం అమలు చేసిన తీరుకూడా అలాగే ఉందని, ఈ చట్టానికి ఉన్న అధికారం అటువంటిదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై తాను ఏ ప్రభుత్వాన్ని తప్పు పట్టడం లేదని కూడా ఎన్వీ రమణ CJI NV Ramana స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతున్నా ఇంకా దేశ ద్రోహం చట్టం అవసరమా అని జస్టిస్ ఎన్వీ రమణ అని ప్రశ్నించారు. ఈ చట్టాన్ని రద్దు చేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారని ఎన్వీ రమణ అన్నారు. సెక్షన్ 124 ఎపై దాఖలైన అన్ని కేసులనూ ఒకేసారి విచారిస్తామని జస్టిస్ ఎన్వీరమణ CJI NV Ramana తెలిపారు. పేకాట ఆడేవారిపైనా దేశద్రోహం చట్టం కింద కేసులు పెడుతున్నారని, బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ సెక్షన్ ను దుర్వినియోగం చేస్తున్నారని ఎన్వీ రమణ CJI NV Ramana అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సెక్షన్ 124 రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ అనేక కేసులు సుప్రీం కోర్టు ముంగిట ఉన్నాయి. అయితే రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్‌జీ వోంబాట్కేర్ వేసిన కేసు మాత్రం వీటన్నింటికంటే భిన్నమైంది. సెక్షన్ 124 కింద నమోదైన కేసులన్నింటినీ కొట్టివేయాలంటూ ఎస్‌జీ వోంబాట్కేర్ సుప్రీం కోర్టు గడప తొక్కారు.
CJI NV Ramana stands for liberty Section 124A
CJI NV Ramana సెక్షన్ 124 ఏ లో ఏముంది..? Section 124A
‘మాటలతో కానీ, చేతలతో కానీ, సంకేతాలతో కానీ, ప్రదర్శనలతో కానీ, మరే విధంగానైనా కానీ.. భారతదేశంలో చట్టబద్ధంగా నియమితమైన ప్రభుత్వం పట్ల అవిధేయతను, విద్వేషాన్ని, శత్రుభావనలను ప్రేరేపించినా.. లేదా ప్రేరేపించటానికి ప్రయత్నించినా.. వారు శిక్షకు అర్హులు. వీరికి జైలు శిక్ష లేదా జరిమానా లేదా కొన్ని సందర్భాల్లో శిక్షతో పాటు జరిమానా విధించి శిక్షించవచ్చు” అని ఐపీసీ సెక్షన్ 124 (ఏ) చెబుతోంది. ఇది నాన్‌బెయిలబుల్ సెక్షన్. 1922లో మహాత్మాగాంధీని కూడా ఈ దేశద్రోహం చట్టం కింద అరెస్ట్ చేశారు. యంగ్ ఇండియా పత్రికలో ఆయన రాసిన వ్యాసాలకు గాను ఈ కేసు నమోదు చేశారు. ఆ సందర్భంగా పౌరుడి స్వేచ్ఛను అణచివేయటానికి రూపొందించిన చట్టం ఇదని మహాత్మాగాంధీ అన్న మాట చాలా ప్రసిద్ధి చెందింది. 1962లో సుప్రీం కోర్టు ఈ చట్టాన్ని సమర్థించింది. అయితే అప్పుడు దేశంలోని పరిస్థితులు వేరు. ప్రస్తుతం ఈ చట్టం ప్రాథమిక హక్కులకు భంగకరంగా మారింది. కనుక దీనిని సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్‌జీ వోంబాట్కేర్ తన పిటిషన్‌లో అభ్యర్థించారు.