Earthquake: ఇండియాలో కూడా భారీ భూకంపాలు.. డేంజర్ జోన్ లో 50 నగరాలు..!!
Earthquake: ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. రెండు రోజులుగా అవధిలో టర్కీ, సిరియా దేశాలలో భూకంపం రావటం తెలిసిందే. వరిసపెట్టి వచ్చిన భూకంపాలు దాటికి చాలావరకు మరణాలు సంభవించాయి. రెండు దేశాలలో భూకంపాలు కారణంగా దాదాపు 7వేల మందికి పైగానే మరణాలు సంభవించాయి. 40 వేలకు పైగా మంది గాయపడ్డారు. ఎక్కువగా టర్కీ దేశంలో ప్రాణ నష్టం జరిగింది. దాదాపు 5వేల కు పైగానే భవనాలు కూలిపోయాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు భారతదేశంలో కూడా భారీ ఎత్తున భూకంపాలు రానున్నట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నివేదిక బయటకు రిలీజ్ చేయడం జరిగింది. ఈ నివేదికలో విజయవాడ, ఢిల్లీ, కోల్కత్తా, చెన్నై, ముంబై సహా 50 నగరాలకు అధిక భూకంపం ఉప్పు ఉన్నట్లు ఎన్డిఎంఏ వెల్లడించింది. ఈ 50 నగరాల జాబితాలో 13 నగరాలు అధిక ప్రమాదకరు స్థాయిలో ఉన్నట్లు 30 మధ్యస్తు ఇంకా ఏడు నగరాలు తక్కువ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు.
ఈ క్రమంలో అధిక భూకంపం మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ సహా దేశ రాజధాని ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తా, తమిళనాడు రాజధాని చెన్నై సహా పూణే, ముంబై, అహ్మదాబాద్, సిలుగురి, డార్జిలింగ్, చండీగఢ్ సహా తదితర నగరాలు ఉన్నట్లు స్పష్టం చేయడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటే వీలైనంతవరకు ఆస్తి మరియు ప్రాణ నష్టం నివారించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.