Turkey: టర్కీలో మరోసారి భూకంపం సహాయక చర్యలు నిలిపివేత..!!
Turkey: భూకంపాలతో టర్కీ మరియు సిరియా దేశాలు విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం అక్కడ వచ్చిన భారీ భూకంపం కారణంగా చాలా ఆస్తి నష్టంతో పాటు ప్రాణా నష్టం కూడా జరిగింది. దాదాపు 34 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. ఇంకా భూకంప శిథిలాల కింద సాయం కోసం ఎదురుచూస్తున్న వాళ్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కంటతడి పెట్టుకుంటున్నారు. భవనాల శిధిలాల నుంచి రోజు కొన్ని వందల శవాలు బయటపడుతున్నాయి.
చాలా దేశాలు టర్కీలో సంభవించిన ఈ ప్రకృతి విలయానికి భూకంపా ప్రభావానికి బలైపోయినా వారికి సహాయక చర్యలలో పాల్గొంటున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. టర్కీలో కహ్రమన్ మరాస్ కు అజ్ఞాయం నుంచి 24 కిలోమీటర్ల దూరంలో 4.7 తీవ్రతతో మరో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ఆదివారం స్పష్టం చేసింది. ఈ భూకంపం 15.7 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు తెలిపింది. ఈ పరిణామంతో చాలా దేశాలు టర్కీలో సహాయక చర్యలు నిలిపివేశాయి. ఆదివారం ఇజ్రాయిల్.. అత్యవసర సహాయ సంస్థ టర్కీ వీడి వెళ్లిపోవడం జరిగింది. ఆ దేశ సిబ్బందికి ముఖ్యమైన భద్రత ముప్పు కారణంగా.. స్వదేశానికి వెళ్లిపోవడం జరిగిందంట.
ఇదిలా ఉంటే టర్కీ భూకంప బాధితులని అక్కడి ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే మరోపక్క దొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు. మృతదేహాలు మరియు క్షతగాత్రుల వద్ద నుంచి నగలు ఇంకా నగదు దోచుకుంటున్నారు. దీంతో దోపిడీదారులను అరికట్టడానికి టర్కీ ప్రభుత్వం భారీ బలగాలను దింపి కొంతమందిని అరెస్టు చేయడం జరిగింది. ఈ దేశంలో భూకంపం కారణంగా నిరాశరులైన బాధితులకు దేశంలో యూనివర్సిటీ హాస్టల్స్, కళాశాలలో, హోటల్స్ నందు ఉచిత వసతితో పాటు ఆహారం అందిస్తుంది ప్రభుత్వం. టర్కీలో కొద్ది రోజులుగా సంభవిస్తున్న భూకంపాల కారణంగా 12 వేలకు పైగా భవనాలు కూలిపోగా దాదాపు ముప్పై వేలకు పైగా మరణాలు సంభవించటం జరిగింది.