Gas Subsidy Cylinders : LPG వినియోగదారులకు భారీ షాక్.. సబ్సిడీ సిలిండర్ల సంఖ్య సగానికి కోత..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 9 June 2026, 10:05 am
  •  Gas Subsidy Cylinders : LPG వినియోగదారులకు భారీ షాక్.. సబ్సిడీ సిలిండర్ల సంఖ్య సగానికి కోత..!

Gas Subsidy Cylinders : దేశవ్యాప్తంగా కోట్లాది మంది వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PM Ujjwala Yojana) కింద సబ్సిడీ పొందుతున్న లబ్ధిదారులపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. ఇప్పటివరకు ఏడాదికి 9 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లపై రాయితీ పొందుతున్న కుటుంబాలకు ఇకపై కేవలం 4 సిలిండర్లకే సబ్సిడీ వర్తించనుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయాలు వంటి కారణాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఉజ్వల పథకం ప్రారంభించినప్పుడు ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఇచ్చేవారు. అనంతరం దీనిని 9 సిలిండర్లకు తగ్గించగా, తాజాగా మరోసారి కోత విధిస్తూ కేవలం 4 సిలిండర్లకే పరిమితం చేసింది.

Gas Subsidy Cylinders : LPG వినియోగదారులకు భారీ షాక్.. సబ్సిడీ సిలిండర్ల సంఖ్య సగానికి కోత..!

Gas Subsidy Cylinders : LPG వినియోగదారులకు భారీ షాక్.. సబ్సిడీ సిలిండర్ల సంఖ్య సగానికి కోత..!

Gas Subsidy Cylinders కుటుంబ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం

పెట్రోలియం శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా సగటు కుటుంబాల గ్యాస్ వినియోగాన్ని పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక గ్యాస్ సిలిండర్‌పై రూ.300 వరకు సబ్సిడీ అందిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ఏడాదికి నాలుగు సిలిండర్లపై మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. అంటే ఒక కుటుంబానికి సంవత్సరానికి గరిష్టంగా రూ.1,200 వరకు మాత్రమే సబ్సిడీ లభిస్తుంది. ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారం కూడా పెరుగుతోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి సిలిండర్‌పై భారీ నష్టాలను భరిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అందువల్లే సబ్సిడీ విధానంలో మార్పులు తీసుకువచ్చినట్లు సమాచారం.

Gas Subsidy Cylinders అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం

అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పశ్చిమాసియాలో చమురు సరఫరా వ్యవస్థపై ప్రభావం పడింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ముడి చమురు ధరలు పెరిగాయి. దీని ప్రభావం భారతదేశంపైనా పడింది. దేశీయంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో పెరుగుదల నమోదవగా, గృహ వినియోగ సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రస్తుతం 14.2 కిలోల గృహ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.994కు చేరుకుంది.

Gas Subsidy Cylinders ఉజ్వల యోజన వల్ల కోట్లాది కుటుంబాలకు లాభం

ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాలు, పేద కుటుంబాలకు పొగరహిత వంట సౌకర్యం కల్పించడమే ఈ పథకం లక్ష్యం. ఈ స్కీమ్ కింద అర్హులైన కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్, మొదటి సిలిండర్, స్టవ్ వంటి ప్రయోజనాలు అందించబడ్డాయి.దేశవ్యాప్తంగా కోట్లాది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. అయితే తాజాగా సబ్సిడీ సిలిండర్ల సంఖ్య తగ్గించడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారుల్లో చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు మెరుగుపడితే సబ్సిడీ విధానంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి