Good News : గుడ్‌న్యూస్.. కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 50 లక్షల ఆర్థిక సాయం పొందండి ఇలా..!
Good News : కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేంద్రం ఇస్తున్న ఫండ్. స్టార్టప్ లు ప్రారంభించే వారిని ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిని 2016 జనవరి 16న కేంద్ర ప్రారంభించింది. దీనికోసం 945 కోట్లు కేటాయించింది. ఈ డబ్బును కేంద్రం ఇంక్యుబేటర్లకు ఇస్తుంది. ఇంక్యుబేటర్ ఈ డబ్బును స్టార్టప్స్ కి ఇచ్చి ఆర్థిక సాయం చేసే బాధ్యతను పొందుతుంది. ఈ డబ్బును స్టార్టప్ పెట్టేవారు తమ కాన్సెప్ట్ ప్రూఫ్ కోసం వాడవచ్చు. అలాగే ప్రోటో టైప్ డెవలప్ చేయవచ్చు. ఇంకా ప్రోడక్ట్ ట్రయల్ చేయవచ్చు. మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వవచ్చు. తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. నాలుగేళ్లలో 300 ఇంక్యుబేటర్లు, 3600 స్టార్టప్ లు ప్రారంభించేలా ఈ పథకం చేసింది. స్టార్టప్ ప్రారంభించాలనుకునేవారు బ్యాంకులో లేదా ఫైనాన్షియల్ సంస్థల దగ్గర వెళ్లి తమ వ్యాపార ఐడియా అని చెప్పి డబ్బును పొందవచ్చు.
ఇందుకోసం వారు అధికారిక వెబ్సైట్ https://seedfund.startupindia.gov.in లో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బును అందేలా చేస్తుంది. వెబ్సైట్లో అప్లై చేసుకున్నాక ఈ ఫైల్ ని ఎక్స్పెక్ట్ అడ్వైజర్ కమిటీ (EAC) పరిశీలిస్తుంది.ఈ కమిటీ డబ్బు ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో ఇంక్యుబేటర్ కి చెబుతుంది. EAC ప్రతి ఇంక్యుబేటర్ కి ఐదు కోట్ల చొప్పున డబ్బు ఇస్తుంది. ఈ డబ్బును మూడు వాయిదాలలో అందజేస్తుంది. అర్హత ఉన్న స్టార్టప్ లకు ఈ డబ్బును ఆర్థిక సాయం గా ఇస్తుంది. ఏ స్టార్టప్ కి ఎంత డబ్బు ఇవ్వాలో ఈఏసి నిర్ణయిస్తుంది. అప్లై చేసుకున్న 45 రోజుల్లో స్టార్టప్ కి మనీ ఇచ్చేది లేనిది ఈఏసీ ద్వారా స్పష్టం చేస్తారు. స్టేటస్ ని బట్టి 20 లక్షలు లేదా 50 లక్షలు ఇస్తారు. మొదటి వాయిదా డబ్బును దరఖాస్తు పెట్టుకున్న 60 రోజుల్లో ఇస్తారు. స్టార్ట్ అప్ DPIIT https://dpiit.gov.in/ గుర్తించాలి. స్టార్ట్ అప్ కి అప్లికేషన్ పెట్టుకుంటే నాటికి దాన్ని ప్రారంభించి రెండేళ్లు దాటకూడదు. స్టార్ట్ అప్ లో భారతీయ ప్రమోటర్ షేర్ కనీసం 51% ఉండాలి.
ఇతర కేంద్ర పథకాల నుంచి ఈ స్టార్టప్ 10 లక్షల నుంచి ఆర్థిక సాయం తీసుకుని ఉండకూడదు. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు, జీఎస్టీ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, లీజ్ అగ్రిమెంట్, ప్రాజెక్ట్ డీటెయిల్స్ రిపోర్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి. పథకానికి అప్లై చేసుకోవడానికి ముందుగా పైన చెప్పిన అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి. హోం పేజీలో అప్లై నౌ ని క్లిక్ చేయాలి. తర్వాత స్టార్ట్ అప్ సెక్షన్లో అప్లై నౌ క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. అందులో పేరు ఆధార్ నెంబర్, ఇమెయిల్ , మొబైల్ నెంబర్ వంటి వివరాలు ఇవ్వాలి. తర్వాత అడిగిన పత్రాల కాపీలు అప్లోడ్ చేయాలి. తర్వాత సబ్మిట్ కొట్టాలి. ఆ తర్వాత అప్డేట్స్ ఇమెయిల్ కి వస్తూ ఉంటాయి. లేదంటే అధికారిక సైట్ లో లాగిన్ అయి కూడా తెలుసుకోవచ్చు.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.