భర్తలను చంపేస్తున్న ప్రస్తుత సమాజంలో.. గొడ్డలితో పోరాడి భర్తను కాపాడిన భార్య..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

భర్తలను చంపేస్తున్న ప్రస్తుత సమాజంలో.. గొడ్డలితో పోరాడి భర్తను కాపాడిన భార్య..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :29 June 2023,12:00 pm

ప్రస్తుత సమాజంలో భయంకరంగా అక్రమ సంబంధాల కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో చాలామంది ఒకరి ప్రాణాలు మరొకరు తీసుకుంటున్నారు. ఈ పరిణామాలతో పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. ఐదు నిమిషాల సుఖాల కోసం జీవితాలను దుర్భరం చేసుకొని అభం శుభం తెలియని పిల్లలను అనాధలను చేస్తున్నారు. చాలావరకు మహిళలు పరాయి పురుషుల మోజులో పడి భర్తలను చంపేస్తున్న కేసులు ఎక్కువ నమోదు అవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇటువంటి సమాజంలో తన భర్తని కాపాడుకోవడం కోసం ఎలుగుబంటులతో గొడ్డలితో పోరాడి చివర ఆఖరికి గెలిచి భర్తప్రాణాలను..

కాపాడుకోవడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా బసవకట్ట గ్రామానికి చెందిన బసీర్ సాబ్ సవదత్తి(45), అతడి బావమరిది ముందగోండకు చెందిన రజాక్ నల్బంద్ (30) నివసిస్తున్నారు. అయితే వాళ్లు ప్రతిరోజు వ్యవసాయ చేయడానికి వెళ్లేవారు. అలాగే శనివారం రోజున ఉదయం రోజు లాగానే పొలానికి వెళ్లారు. ఆ ఇద్దరూ పనిలో నిమగ్నమై ఉండగా వారిపై అకస్మాత్తుగా ఓక్కసారిగా మూడు ఎలుగుబంట్లు దాడి చేసాయి.. ఎలుగుబంట్లు దాడి చేస్తున్న విషయం గమనించిన బసీర్ సాబ్ భార్య సబీనా(35) ఒక్కసారి షాక్ కు గురి అయ్యి వెంటనే తేలుకొని.. తన భర్త ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకొని పక్కనే ఉన్న గొడ్డలిని తీసుకొని… ముందు వెనక ఆలోచించకుండా… ఆ మూడు ఎలుగుబంటులలో ఒక ఎలుగుబంటిపై అమాంతంగా గొడ్డలితో దాడి చేయడం జరిగింది.

he wife who fought with an ax and saved her husband

he wife who fought with an ax and saved her husband

దీంతో తీవ్రంగా ఎలుగుబంటు గాయపడటంతో మిగతా రెండు ఎలుగుబంటులు దాడి చేయడం ఆపేసి పరారయ్యాయి. గాయపడిన ఎలుగుబంటి కూడా తప్పించుకుని పారిపోయింది. ఈ రకంగా సబీనా.. తన భర్త ప్రాణాలను కాపాడుకోవడం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన బసీర్, రజాక్ లను చికిత్స కోసం హుబ్బళ్లిలోని కర్ణాటక ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Tags :

    sekhar

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది