
intinti gruhalakshmi 31 august 2022 full episode
Intinti Gruhalakhsmi 31 Aug Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 ఆగస్టు 2022, బుధవారం ఎపిసోడ్ 725 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను వచ్చీ రాగానే ఆణిముత్యాల్లాంటి మాటలు పంతులు గారి నోటి నుంచి వినిపించాయి. ఇవి మీరే చెప్పారా? మిమ్మల్ని బలవంతంగా చెప్పించారా? అంటాడు అభి. దీంతో ఇప్పుడు ఎందుకు పంతులు గారిని నిలదీస్తున్నావు రా అంటాడు ప్రేమ్. దీంతో మీకు ఇందులో ఏదీ తప్పుగా అనిపించడం లేదా అంటాడు అభి. లేనిపోనివి ఊహించుకొని ఆవేశపడుతున్నావు. తొందరపడి మాటలు జారకు. ఇది సమయం కాదు అంటుంది తులసి. కానీ.. నేను అడగాల్సిన ప్రశ్నలు నన్ను అడగనియ్యు మామ్ అంటాడు అభి. నీ కొడుకుగా నాకు అడిగే హక్కు ఉంది అంటాడు అభి. ఎటువంటి అర్హత లేని మా మామ్ ను చూసి మీరు ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటాడు అభి. దీంతో అర్హత లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ.. అర్హత ఉందని నేను అనుకుంటున్నా అంటాడు సామ్రాట్. ఇదే డ్రామా అంటున్నా అంటాడు. నువ్వు మీ అమ్మను ఎందుకు ఇంత తక్కువ అంచనా వేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఏదో సాధించాలనే తపన ఆమెలో నీకు కనిపించడం లేదా అంటాడు సామ్రాట్.
intinti gruhalakshmi 31 august 2022 full episode
దీంతో కనపడవు.. ఎందుకంటే వాడు గుడ్డోడు కాబట్టి అంటాడు ప్రేమ్. దీంతో కళ్లు మూసుకుపోయింది మీకురా. సామ్రాట్ గారు అమ్మకు దగ్గరవ్వాలని చూస్తున్నారు. అందుకే ఇదంతా చేస్తున్నారు అంటాడు అభి. దీంతో అభి అంటూ గట్టిగా అరుస్తుంది తులసి. నేను నిన్ను అనుమానించడం లేదు మామ్.. ఆయన్ను అనుమానిస్తున్నాను. ఆయన్నే సమాధానం చెప్పనివ్వు అంటాడు అభి. దీంతో చెప్పరురా.. మతి లేని నీ ప్రశ్నలకు దేవుడు లాంటి సామ్రాట్ గారు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను రెచ్చగొట్టి మీ నాన్నే ఇలా నిన్ను మాట్లాడిస్తున్నాడు. పండగ లాంటి వాతావరణాన్ని చెడగొట్టిస్తున్నాడు. మీ నాన్న మా అక్కను ఎదగకుండా చేశాడు. ఇప్పుడు నిన్ను అడ్డుపెట్టుకొని మళ్లీ అదే పని చేస్తున్నాడు. ఈ జన్మలో బాగుపడడురా.. నాశనం అయిపోతాడు అంటాడు దీపక్. దీంతో ఒరేయ్ అంటూ కోపంతో అరుస్తాడు నందు. వాడు కడుపు మండి ఏదో మాట్లాడితే వాడికి నాకు లింక్ పెడుతావు ఏంటి. మర్యాద ఇచ్చి మాట్లాడురా అంటాడు నందు.
దీంతో మా అక్క మొగుడిగా ఉన్నంత కాలం మర్యాద ఇచ్చాను కానీ.. నిలబెట్టుకోలేకపోయావు. దిగజారి ప్రవర్తించావు. విడాకుల దాకా తీసుకొచ్చావు అంటాడు దీపక్. దీంతో విడాకుల దాకా తీసుకొచ్చింది నేను కాదు.. మీ అక్క అంటాడు నందు. దీందో సామ్రాట్ షాక్ అవుతాడు.
అంటే తులసి గారి మాజీ భర్తవు నువ్వా అంటాడు సామ్రాట్. దీంతో నందు షాక్ అవుతాడు. ఇది నిజమా తులసి గారు అని అడుగుతాడు సామ్రాట్. ఇప్పుడు సమస్య అది కాదు సామ్రాట్ గారు. మీరు మామ్ గురించి మనసులో ఏమనుకుంటున్నారో అది చెప్పండి అని అడుగుతాడు అభి.
మీ అమ్మ నేర్పని సంస్కారం ఎక్కడ పోయిందిరా. ఎవర్రా మీ నీ మైండ్ ను పొల్యూట్ చేసింది. ఇంకొక మాట మాట్లాడితే నాలుక చీరేస్తా. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని అంటాడు పరందామయ్య. క్షమించయ్య అని దండం పెడతాడు సామ్రాట్ కు. నా పెద్దరికాన్ని పోగొట్టుకున్నాను.
నాకొడుకు, నా మనవడు… ఇద్దరూ చేయి జారిపోయారు బాబు అంటాడు. మంచి మర్యాద లేకుండా మిమ్మల్ని అవమానించేలా మాట్లాడారు. మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత నాకు లేదు. అయినా అడుగుతున్నాను. పెద్దమనసు చేసుకొని క్షమించండి అయ్యా అంటాడు పరందామయ్య.
అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. కేవలం సామ్రాట్, తులసి, బాబాయి మాత్రమే మిగులుతారు. క్షమించండి అని చెప్పి తులసి కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అనుకున్నది సాధించావు కదా కడుపు మంట చల్లారిందా అని అభిని ఉద్దేశించి అంటాడు ప్రేమ్.
జీవితంలో పైకి ఎదగడానికి దొరికిన బంగారం లాంటి అవకాశాన్ని చేజారేలా చేశావు అంటాడు ప్రేమ్. మామ్ అంటే మీకు గుడ్డి ప్రేమ. అందుకే మీకు ఏదీ కనిపించడం లేదు అంటాడు అభి. ఆ తర్వాత అసలు విషయం చెబుతుంది శృతి. నేను ఇప్పటికే సామ్రాట్ గారిని ఆ విషయం అడిగాను అంటుంది శృతి.
ఆయన మనసులో ఆంటీ మీద గౌరవం తప్పితే ఇంకేం ఆలోచన లేదన్నారు అని అసలు విషయం చెబుతుంది శృతి. దీంతో అభి నవ్వుతాడు. ఆయన చెప్పడం బాగుంది. నువ్వు నమ్మడం బాగుంది అంటాడు అభి. ఇంతలో తులసి వస్తుంది. ప్రేమ్ ఆగు.. మీరు గొడవ పెట్టుకోకండి అంటుంది తులసి.
ఎవ్వరూ అభిని ఒక్క మాట కూడా అనడానికి వీలు లేదు. ఈ విషయాన్ని ఇక ఇంతటితో వదిలేయండి అని చెప్పి వెళ్లిపోతుంది తులసి. ఇంటికి వెళ్లాక కోపంతో రగిలిపోతాడు నందు. ఆమె తమ్ముడితో నిజం బయటపెట్టేలా చేసింది తులసి అని చెబుతుంది లాస్య.
ఇక మన జాబ్స్ ఉంటాయా. మనల్ని తీసేస్తాడు అంటుంది లాస్య. ఆ తర్వాత తులసి దగ్గరికి తన తమ్ముడు దీపక్ వెళ్లి మాట్లాడుతాడు. మరోవైపు నందు, లాస్య తులసి ఇంటికి వెళ్తారు. నువ్వు ఎంత ఎదగాలనుకున్నా ఎదగనివ్వను అంటాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.