India Post Jobs : ఇండియా పోస్ట్ లో ఉద్యోగాలు.. టెన్త్ అర్హతతో అప్లయ్
India Post Jobs : ఇండియా పోస్ట్ సర్వీస్ లో వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తోంది. కేవలం టెన్త్ అర్హతతో ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పోస్టుల శాఖ ఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 10వ తరగతి ఉత్తీర్ణులైన యువత ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్ ముంబైలోని ఇండియా పోస్ట్ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
మొత్తం 24 ఖాళీలు ఉండగా ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 జులై 20 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్స్ స్పీడ్ పోస్టు లేదా రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి. టెన్త్ పాస్ కావడంతో పాటు నోటిఫికేషన్‌లో సూచించిన డ్రైవింగ్ అర్హతలు కూడా అభ్యర్థులు ఉండాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. అయితే ఈ జాబ్ కి అప్లయ్ చేసే అభ్యర్తి వయసు 57 ఏళ్లకు మించరాదు.
India Post Jobs : అర్హతలు, వేతనాలు..
అలాగే గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఎంపిక ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులకు ఏడో పే కమిషన్ పే మ్యాట్రిక్స్‌లో లెవెల్ 2 పే స్కేల్ వర్తిస్తుంది. రూ.19,900 బేసిక్ వేతనం లభిస్తుంది. దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కలదు. అలాగే దరఖాస్తులు The Senior Manager, Mail Motor Service, No 37, Greams Road, Chennai-600006 ఈ అడ్రస్ కి పంపాలి.