Crime News : ప్రియుడితో కలిసి కన్న తల్లినే చంపేసిన మైనర్ బాలిక.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 Authored By kranthi | The Telugu News | Updated on :2 January 2023,8:30 am

Crime News : ఈరోజుల్లో బంధాలు, బంధుత్వాలు ఉన్నాయా? సొంత కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులనే చంపేస్తున్నారు. ఏమాత్రం జాలి, దయ, కరుణ లేకుండా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. తాజాగా మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కన్న తల్లినే మట్టుబెట్టింది మైనర్ బాలిక. అది కూడా తన ప్రియుడి సాయంతో తల్లిని చంపేసింది. అసలు.. సొంత తల్లిని చంపాల్సిన అవసరం ఏం వచ్చింది. అంత చిన్న వయసులో ఎందుకు అంత కర్కశమైన నిర్ణయం తీసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం.

minor daughter kills mother with help of boy friend in gwalior

minor daughter kills mother with help of boy friend in gwalior

కేవలం తన ప్రేమకు అడ్డంకిగా ఉందన్న కారణంతో తల్లిపై ఆ బాలిక ద్వేషం పెంచుకుంది. చివరకు తన ప్రియుడితో కలిసి ఆమెను చంపి.. రాత్రి మొత్తం ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టి ఆమె పక్కనే పడుకుంది. ఆ తర్వాత ఉదయం లేచి ఇద్దరూ పారిపోయారు. ఇంటి యజమానికి అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా మమత(45) మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె గొంతు, శరీరంపై కత్తితో పొడిచిన గాయాలు ఉండటం, కూతురు కూడా కనిపించకపోవడంతో తన మీదనే పోలీసులకు అనుమానం వచ్చింది.

Crime News : వెంటనే కేసును ఛేదించిన పోలీసులు

ఈ కేసును కొద్ది గంటల్లోనే పోలీసులు ఛేదించారు. పరారిలో ఉన్న మమత కూతురు, తన లవర్ ను ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కేవలం.. ఆ యువకుడితో ప్రేమకు అడ్డు చెప్పిందని.. తన లవర్ తో కలిసి సొంత తల్లిని సోనూ చంపేసింది. అయితే.. ఇదివరకే మైనర్ బాలికపై అత్యాచారం చేసి జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలయ్యాడు అతడు. అందుకే అతడితో ప్రేమకు అడ్డు చెప్పింది తల్లి. దీంతో సొంత తల్లినే అడ్డు తప్పించాలని తన ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది సోనూ. కానీ.. చివరకు పోలీసులకు ఇద్దరూ అడ్డంగా దొరికిపోయారు.

kranthi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి