Modi : కూటమి ప్రభుత్వం ఏపీలో AP Govt తిరుగులేని విజయాన్ని దక్కించుకుంది. వైసీపీని Ysrcp కేవలం పది సీట్లకి మాత్రమే పరిమితం చేసి భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి BJP తేడా కొట్టాయి. ముఖ్యంగా అతి పెద్ద స్టేట్ అయిన యూపీలో బీజేపీకి దాదాపుగా సగానికి సగం సీట్లు తగ్గాయి. అలాగే గతసారి పశ్చిన బెంగాల్ లో 22 ఎంపీ సీట్లు బీజేపీ గెలిస్తే ఈసారి 12కే పరిమితం కావాల్సి వచ్చింది. అంటే ఇక్కడ పది సీట్లు తగ్గాయి. అలాగే మహారాష్ట్రలో Maharasta బీజేపీ శివసేన Sivasena కాంబో ఆనాడు మెజారిటీ సీట్లు కొల్లగొడితే ఈసారి శివసేన ఎన్సీపీ చీలిక పార్టీలు ఏమీ కాకుండా పోయాయి. బీజేపీకి ఈ విధంగా దెబ్బ గట్టిగా తగిలింది. ఈ రకంగా 2019 ఎలక్షన్స్ కన్నా కూడా చాలా తక్కువ సీట్లని సంపాదించుకుంది బీజేపి. 2019లో 304 సీట్లు సొంతంగా గెలుచుకున్న బీజేపీకి ఈసారి 238 సీట్లు మాత్రమే దక్కాయి.
66 సీట్లు భారీ కోతకు గురి అయ్యాయి. ఇక కేంద్రంలో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 272 ఉంది. ఎన్డీయేలో NDA పెద్ద పార్టీలు చూస్తే టీడీపీ TDP 16 సీట్లతో ఉంది. ఆ తరువాత పదిహేను సీట్లతో జేడీయూ ఉంది. ఇక ఏపీ నుంచే జనసేన కూడా ఉంది. ఆ పార్టీకి రెండు సీట్లు ఉన్నాయి. ఇలా ఈ పార్టీలు కలుపుకుంటేనే మోడీ మూడోసారి ప్రధానిగా అయ్యే అవకాశం ఉంది. అతి కీలకమైన 18 ఎంపీ సీట్లు చంద్రబాబు, బాబు దగ్గర ఉన్నాయి. ఈ క్రమంలో మరోసారి మోదీని ప్రధానిగా చేసి అక్కడ నుండి ఏం తీసుకువస్తారు, ఏపీని ఏ రకంగా డెవలప్ చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. మోడీ ప్రధాని సీటుకే ఏపీ సీట్లు ఆక్సిజన్ గా మారుతున్నాయి. అవి లేకపోతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఏర్పాటు కాదు.
ఈ సారి Pawan Kalyan పవన్, Chandrababu చంద్రబాబుల దగ్గర మోదీ కీ ఉండడంతో ఏపీకి పదేళ్ళుగా ఉన్న విభజన హామీలతో పాటు కేంద్రం నుంచి రావాల్సినవి అన్ని సాధించుకుంటారా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. బీజేపీకి సపోర్ట్‌గా ఉంటూనే వారి మెడలు వంచాల్సిన సమయం ఇప్పుడే వచ్చిందని కొందరు చెబుతున్న మాట. ఏపీ ప్రయోజనాలకు ఈ రెండు పార్టీలు కట్టుబడి ఉండాలని అంటున్నారు. ఆ విధంగా చేస్తేనే బీజేపీకి ఫికర్ ఉంటుందని ఏపీకి ఏమి చేయాలన్నా కమలం పార్టీ కదులుతుందని అంటున్నారు. నిజంగా కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడం, ఏపీలోని ఎంపీల మీద ఆధారపడడం అన్నది రాష్ట్రానికే మేలు అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ దానిని ఎలా సద్వినియోగం చేసుకుంటారు అనేది చూడాలి.
Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఇస్కాన్ కోల్‌కతా తిలకం తుడిచివేయాలని మరియు తులసి పూసలను దాచుకోవాలని, తలలు…
Hemant Soren : జార్ఖండ్‌లో ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజుల తర్వాత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాత్రమే మంత్రిగా…
Donald Trump : తాను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా…
Rashmika Mandanna : ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించే రష్మిక ఇప్పుడు దారుణంగా అందాలు ఆరబోస్తుంది. స్కిన్ షో విషయంలో…
Tollywood : డిసెంబర్ 5న పుష్ప2 Pushpa 2 చిత్రం విడుదల కానుండగా డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8లో ఆసక్తికర ఫైట్ జరగుతుంది. టాప్ 5 కోసం…
Farmers : అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐతే వారికి ఈ వర్షాల వల్ల పంట…
Lipstick : ప్రస్తుత కాలంలో చాలామంది లిప్ స్టిక్ లేకుండా అస్సలు ఉండలేరు. అయితే ఈ లిప్ స్టిక్ ను పెదవులు…
This website uses cookies.