Bank News Rules : ఒకటికంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నవారికి కొత్త రూల్స్…కచ్చితంగా తెలుసుకోండి…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Bank News Rules : ఒకటికంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నవారికి కొత్త రూల్స్…కచ్చితంగా తెలుసుకోండి…!

Bank News Rules : ప్రస్తుత కాలంలో చాలా ప్రైవేట్ బ్యాంకులు అనేక రకాల ప్రత్యేక సేవలను కస్టమర్లకు అందిస్తున్నారు. ఇక ఈ సేవలు కస్టమర్లు బహుళ సంఖ్యలో బ్యాంకు ఖాతాలను తెరవడానికి దారితీస్తుందని చెప్పాలి. అయితే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా..?ఇక పూర్తి వివరాల్లోకి వెళితే. గతంతో పోల్చి చూసినట్లయితే ఈ రోజుల్లో బ్యాంకు పనులు చాలా సులభంగా చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంకు ఖాతాను కూడా నిమిషాల్లోనే డిజిటల్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :23 March 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Bank News Rules : ఒకటికంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నవారికి కొత్త రూల్స్...కచ్చితంగా తెలుసుకోండి...!

Bank News Rules : ప్రస్తుత కాలంలో చాలా ప్రైవేట్ బ్యాంకులు అనేక రకాల ప్రత్యేక సేవలను కస్టమర్లకు అందిస్తున్నారు. ఇక ఈ సేవలు కస్టమర్లు బహుళ సంఖ్యలో బ్యాంకు ఖాతాలను తెరవడానికి దారితీస్తుందని చెప్పాలి. అయితే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా..?ఇక పూర్తి వివరాల్లోకి వెళితే. గతంతో పోల్చి చూసినట్లయితే ఈ రోజుల్లో బ్యాంకు పనులు చాలా సులభంగా చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంకు ఖాతాను కూడా నిమిషాల్లోనే డిజిటల్ గా తెరవగలుగుతున్నారు. ఎవరైనా సరే ఎక్కడి నుండైనా సరే తక్షణ చెల్లింపులు డిజిటల్ సదుపాయం ఆన్లైన్ కేవైసీ రిజిస్ట్రేషన్ , ఆన్లైన్ బ్యాంకింగ్, ఆ తర్వాత బ్యాంకు ఖాతా తెరిచే ప్రక్రియ ఇలాంటి చాలా పనులు చాలా సులభంగా జరుగుతున్నాయి. తద్వారా వినియోగదారులు సైతం ఆకర్షితులవుతున్నారు. దీంతో చాలామంది అనేక బ్యాంకు ఖాతాలను తెరుస్తున్నారు. అయితే ఒక్కొక్క బ్యాంకు వేరువేరు విధానాలను కలిగి ఉండడం వలన ఒకే సమయంలో ఒకటికంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను నిర్వహించడం అనేది చాలా కష్టమని చెప్పాలి. అయితే ఒక వ్యక్తి ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండటం వలన కలిగే నష్టాలు ఏంటి వాటిని ఎలా అధిగమించాలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Bank News Rules కనీసం నగదు నిల్వ

ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్నవారు ఎదుర్కునే మొదటి సమస్య ప్రతి బ్యాంకు ఖాతాలో కనీస నగదు నిల్వ ఉంచటం. అలాగే ప్రస్తుత కాలంలో చాలా బ్యాంకులు వారి సేవింగ్స్ ఖాతాలో ఉంచాల్సిన కనీసం మొత్తాన్ని పెంచడం జరిగింది. కావున అలా చేయడంలో విఫలమైనట్లయితే జరిమానాలు విధిస్తారు. అదేవిధంగా ప్రస్తుతం పెరుగుతున్న డిజిటల్ ప్రపంచంలో ఆన్లైన్ మోసాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉండటం వలన మోసానికి దారి తీసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కాబట్టి ఒకటికంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండటం మంచిది.

Bank News Rules ఒకటికంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నవారికి కొత్త రూల్స్కచ్చితంగా తెలుసుకోండి

Bank News Rules : ఒకటికంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నవారికి కొత్త రూల్స్…కచ్చితంగా తెలుసుకోండి…!

Bank News Rules బ్యాంకు చార్జీలు…

ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్నవారు ఎదుర్కొనే మరో సమస్య బ్యాంకు చార్జీలు. అయితే చాలామంది ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్నప్పటికీ వాటిలో కొన్నింటిని మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఇక మిగిలిన ఖాతాలను వినియోగించకుండా పక్కన పడేస్తారు. అయితే ఆ విధంగా ఎక్కువ కాలం లావాదేవీలు జరగకుండా ఉండటం వలన మీ ఖాతాను మూసివేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ సందర్భంలో ఖాతాను తిరిగి వినియోగించాలంటే కచ్చితంగా అదనపు చార్జీలు చెల్లించాలి. ఇక ఈ సమస్యలు నివారించాలంటే కచ్చితంగా అన్ని బ్యాంకు ఖాతాలో ఎప్పటికప్పుడు చిన్నచిన్న లావాదేవీలు చేస్తూ ఉండాలి.

Bank News Rules బ్యాంకింగ్ సేవలు…

అయితే చాలా రకాల ప్రైవేట్ బ్యాంకులు తమ కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక రకాల ఉచిత ప్లాన్ లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే వీటిలో కొన్ని సేవలు ఉచితంగా ఉంటే మరికొన్ని సేవలకు మాత్రం తప్పనిసరిగా చార్జీలు విధిస్తారు. అయితే వినియోగదారులకు వాటిపై అవగాహన ఉండదు. ఇక ఇవి మొదట చిన్నవిగా అనిపించినప్పటికీ తర్వాత పెద్ద తలనొప్పిగా మారుతాయి అని చెప్పాలి. కాబట్టి మీకు ఎలాంటి సేవలు అందిస్తున్నారో తెలుసుకోవడం మంచిది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది