Farmer : రాత్రికి రాత్రే కోటీశ్వరులైన రైతులు.. వచ్చిన భూ పరిహారంతో ఏకంగా హెలికాప్టర్ కొంటున్న ఓ రైతు..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :31 March 2026,10:30 am

ప్రధానాంశాలు:

  •  Farmer : రాత్రికి రాత్రే కోటీశ్వరులైన రైతులు.. వచ్చిన భూ పరిహారంతో ఏకంగా హెలికాప్టర్ కొంటున్న ఓ రైతు..!

Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం Compensation ఏ మూలకూ చాలదంటూ ధర్నాలకు దిగుతారు. కానీ, ఇక్కడ సీన్ పూర్తిగా రివర్స్. ఒక భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోయారు. వారికి అందిన పరిహారం కలలో కూడా ఊహించనంత భారీగా ఉండటంతో.. వారి ఆర్థిక స్థితిగతులు, ఆలోచనా విధానాలు పూర్తిగా మారిపోయాయి. ఈ అనూహ్య పరిణామాలకు వేదికైంది ఉత్తరప్రదేశ్‌ Uttar Pradesh రాష్ట్రం.

Noida Airport Land Acquisition : రాత్రికి రాత్రే కోటీశ్వరులైన రైతులు.. వచ్చిన భూ పరిహారంతో ఏకంగా హెలికాప్టర్ కొంటున్న ఓ రైతు

Noida Airport Land Acquisition : రాత్రికి రాత్రే కోటీశ్వరులైన రైతులు.. వచ్చిన భూ పరిహారంతో ఏకంగా హెలికాప్టర్ కొంటున్న ఓ రైతు

సరిగ్గా చెప్పాలంటే, యూపీలోని జేవార్‌ Jewar ప్రాంతంలో నిర్మిస్తున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం Noida International Airport అక్కడి రైతుల పాలిట కల్పతరువుగా మారింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ Narendra Modi ప్రారంభించిన ఈ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్.. ఆ ప్రాంత రూపురేఖలను సమూలంగా మార్చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం భారీగా పరిహారం చెల్లించింది. ఈ పరిహారంతో అక్కడి రైతుల దశ తిరిగింది.

Farmer రూ.15 కోట్ల పరిహారం.. హెలికాప్టర్ కొనే ప్లాన్‌లో రైతు

భూ పరిహారం కింద భారీగా డబ్బులు రావడంతో రైతులు ఇప్పుడు విలాసవంతమైన జీవితంపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో ఒక ఆసక్తికరమైన ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. నోయిడా ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులో భూమి కోల్పోయిన ఒక రైతుకు ఏకంగా అక్షరాలా రూ.15 కోట్లు Rs.15 Crores పరిహారంగా అందాయి. అంత భారీ మొత్తం చేతికి రావడంతో ఆ రైతు ఆలోచనలు కూడా ఆకాశాన్ని తాకాయి. వచ్చిన డబ్బుతో ఏంచేస్తావు? అని అడిగితే.. అతను చెప్పిన సమాధానం విని అందరూ అవాక్కవుతున్నారు.

ఏదైనా ఇల్లు కొంటాననో, వ్యాపారం చేస్తాననో చెప్పకుండా.. ఏకంగా “ఒక హెలికాప్టర్ Helicopter కొంటాను” అని బదులిచ్చాడు. అంతేకాదు, హెలికాప్టర్ కొనుగోలు చేయడంతో పాటు, తన స్నేహితులతో కలిసి విదేశీ పర్యటనలకు Foreign Trips వెళ్లేందుకు కూడా ఆ రైతు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. ఆ ప్రాంతంలో భూ పరిహారం ఏ స్థాయిలో అందిందో, రైతుల ఆలోచనలు ఏ విధంగా మారిపోయాయో అర్థం చేసుకోవడానికి.

మారిపోతున్న గ్రామీణ ముఖచిత్రం.. విలాసాలపై మోజు

నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ పుణ్యమా అని జేవార్ చుట్టుపక్కల గ్రామాల ముఖచిత్రం పూర్తిగా మారిపోతోంది. నిన్నటి వరకు సాధారణ వ్యవసాయం చేసుకునే రైతులు.. నేడు లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే ఉండటంతో, పెద్ద ఎత్తున శ్రామిక శక్తి అవసరం ఏర్పడింది. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరిగాయి. స్థానికులకు రకరకాల మార్గాల్లో ఆదాయం పెరుగుతోంది. చేతినిండా డబ్బులు రావడంతో, వాటిని విలాసవంతమైన వస్తువులు, కార్లు, ఖరీదైన గ్యాడ్జెట్స్ కొనడం కోసం ఖర్చు చేయడానికి స్థానికులు మక్కువ చూపుతున్నారు. అయితే, ఇలాంటి ఆకస్మిక సంపద వచ్చినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిపుణుల హెచ్చరిక: పెట్టుబడులే శ్రీరామరక్ష

భూ పరిహారం కింద వచ్చిన భారీ మొత్తాలను కేవలం విలాసాలకు, అనవసర ఖర్చులకు వినియోగిస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు. చేతికి వచ్చిన డబ్బును సరైన మార్గాల్లో, అంటే స్థిరాస్తులు Real Estate, వ్యాపారాలు లేదా సురక్షితమైన ఫండ్స్‌లో పెట్టుబడులుగా Investments పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు. అలా కాకుండా హెలికాప్టర్లు, లగ్జరీ కార్లు, ఖరీదైన ట్రిప్స్ అంటూ డబ్బును వృధా చేస్తే.. కొన్నాళ్లకే మళ్లీ పాత పరిస్థితికి చేరుకునే ప్రమాదం ఉందని, ఆ తర్వాత చింతించినా ప్రయోజనం ఉండదని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా.. ఒకే ఒక్క ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్.. జేవార్ రైతుల తలరాతలను మార్చేసిందన్నది మాత్రం అక్షర సత్యం!

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి