Pakistan : తోటి ముస్లిం దేశాన్ని దారుణ వెన్నపోటు పొడిచిన పాకిస్తాన్ .. ఛీ థూ అని తిడుతున్న ముస్లింలు

 Authored By siddhu | The Telugu News | Updated on :5 April 2026,1:30 pm

ప్రధానాంశాలు:

  •  Pakistan : తోటి ముస్లిం దేశాన్ని దారుణ వెన్నపోటు పొడిచిన పాకిస్తాన్ .. ఛీ థూ అని తిడుతున్న ముస్లింలు..!

Pakistan: ప్రస్తుతం ఇస్లామిక్ దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మతం పేరుతో రాజకీయాలు ఎలా సాగుతాయో అర్థమవుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ తన పొరుగు దేశమైన ఇరాన్ విషయంలో అనుసరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ ముస్లింలే అని చెప్పుకుంటూనే లోలోపల ఒకరికొకరు వెన్నుపోటు పొడుచుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్ లోని సీస్తాన్ బలచిస్తాన్ ప్రాంతంలో అల్లర్లు సృష్టించేందుకు పాకిస్తాన్ లోని తిరుగుబాటుదారులకు ఆయుధాలు మరియు శిక్షణ ఇస్తున్నట్లు గట్టి ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల ఇరాన్ అనేకసార్లు పాకిస్తాన్ గగనతలంలోకి వచ్చి దాడులు చేయాల్సి వచ్చింది. సాధారణంగా ముస్లిం దేశాల మధ్య ఐక్యత ఉంటుందని అందరూ అనుకుంటారు కానీ ఇక్కడ మాత్రం షియా మరియు సున్నీ వర్గాల మధ్య ఉన్న విభేదాలను పాకిస్తాన్ తన స్వార్థం కోసం వాడుకుంటోంది.

Pakistan : తోటి ముస్లిం దేశాన్ని దారుణ వెన్నపోటు పొడిచిన పాకిస్తాన్ .. ఛీ థూ అని తిడుతున్న ముస్లింలు..!

Pakistan : తోటి ముస్లిం దేశాన్ని దారుణ వెన్నపోటు పొడిచిన పాకిస్తాన్ .. ఛీ థూ అని తిడుతున్న ముస్లింలు..!

Pakistan : సరిహద్దుల్లో నమ్మకద్రోహం

యుద్ధం తీవ్రంగా ఉన్న సమయంలో కూడా ఇరాన్ మానవతా దృక్పథంతో కొన్ని దేశాల నౌకలకు హార్మోజ్ జలసంధి గుండా వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది. అందులో పాకిస్తాన్ కూడా ఉంది. పాకిస్తాన్ జెండాతో వెళ్ళిన ఆ నౌకలు నిజానికి అమెరికాకు చెందినవని వార్తలు రావడం ఇరాన్ కు పెద్ద షాక్ ఇచ్చింది. తన భూభాగాన్ని అమెరికా వైమానిక దళాలకు అప్పగించి ఇరాన్ పై దాడులు చేయడంలో పాకిస్తాన్ పరోక్షంగా సహకరిస్తోంది. క్రైస్తవ దేశాలుగా పిలవబడే ఫ్రాన్స్ మరియు ఇటలీ వంటి దేశాలు కూడా అమెరికా దాడులకు తమ గగనతలాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తుంటే ఒక ముస్లిం దేశం ఉండి మరో ముస్లిం దేశంపై దాడికి సహకరించడం విడ్డూరంగా ఉంది. శాంతి చర్చల పేరుతో పాకిస్తాన్ నాటకాలు ఆడుతూ ఇరాన్ ప్రమేయం లేకుండానే సమావేశాలు నిర్వహిస్తోంది. ఇది కేవలం ప్రపంచ దేశాల ముందు తనను తాను మంచిగా చూపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే. ఇజ్రాయిల్ ను గుర్తించమని ఇతర దేశాలకు చెబుతూనే మరోవైపు ఇజ్రాయిల్ కు అనుకూలమైన పనులు చేయడం పాకిస్తాన్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం.

ఇరాన్ ను ఇబ్బంది పెట్టేందుకు సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందాలు చేసుకోవడం కూడా ఇందులో భాగమే. పొరుగు దేశంతో దోస్తీ నటిస్తూనే వెనుక నుండి గోతులు తవ్వడం పాకిస్తాన్ కు అలవాటుగా మారింది. ఈ రకమైన వ్యవహార శైలి వల్ల ముస్లిం దేశాల మధ్య నమ్మకం దెబ్బతినడమే కాకుండా ప్రాంతీయంగా అశాంతి పెరుగుతోంది. ఒకవైపు మత రక్షణ గురించి మాట్లాడుతూనే మరోవైపు పరాయి దేశాల ప్రయోజనాల కోసం స్వంత మతస్థులనే దెబ్బతీయడం వల్ల పాకిస్తాన్ విశ్వసనీయత కోల్పోతోంది. ఇరాన్ ప్రస్తుతం ఈ విషయాలన్నిటినీ గమనిస్తూ మౌనంగా ఉన్నా భవిష్యత్తులో ఈ పరిణామాలు తీవ్రంగా మారే అవకాశం ఉంది.

siddhu

Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15 years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి