Punjab CM Bhagwant Mann : 50 ఏళ్ల వయసులో తండ్రి అయిన పంజాబ్ సీఎం..!
ప్రధానాంశాలు:
Punjab CM Bhagwant Mann : 50 ఏళ్ల వయసులో తండ్రి అయిన పంజాబ్ సీఎం..!
Punjab CM Bhagwant Mann : ఈ నడుమ చాలా మంది వయసుతో సంబంధం లేకుండా పిల్లల్ని కంటున్నారు. అందులో స్టార్ సెలబ్రిటీలు కూడా ఉంటున్నారు. ఇప్పుడు తాజాగా పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ చేరిపోయారు. ఆయన దేశరాజకీయాల్లో ఓ సంచలనం. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఒక కమెడయిన్ గా స్టార్ట్ అయిన ఆయన కెరీర్ దేశ రాజకీయాలను ఆకర్షించింది. మొట్టమొదటిసారి పంజాబ్ లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ వరకే పరిమితం అయిన ఆప్ పార్టీ ఇప్పుడు పంజాబ్ కు చేరుకుంది.
కాగా పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణం చేసినప్పటి నుంచి ఆయన ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. అది రాజకీయంగానే అని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మొదటిసారి ఆయన వ్యక్తిగత విషయం వల్ల వార్తల్లో నిలిచారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఆయన 50 ఏళ్ల వయసులో తండ్రి అయ్యారు. ఆయన భార్య డా.గురుప్రీత్ కౌర్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని భగవంత్ మాన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కాగా భగవంత్ మాన్ రెండో భార్యనే గురుప్రీత్ కౌర్. గతంలో భగవంత్ మాన్ కు పెళ్లి అయి విడాకులు అయ్యాయి.

Punjab CM Bhagwant Mann : 50 ఏళ్ల వయసులో తండ్రి అయిన పంజాబ్ సీఎం..!
ఇందర్ ప్రీత్ కౌర్ అననే అమ్మాయితో ఆయనకు మొదటగా పెళ్లి అయింది. కానీ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరూ విడిపోయారు. కాగా 2022లో గురుప్రీత్ కౌర్ ను భగవంత్ మాన్ రెండో పెల్లి చేసుకున్నారు. ఇప్పుడు వీరికి మొదటి సంతానం కలిగింది. అయితే ఈ వయసులో ఆయన మూడోసారి తండ్రి కావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కానీ అందరూ ఆయనకు విషెస్ చెబుతున్నారు. కానీ బిడ్డకు సంబంధించిన విషయాలను ఆయన పంచుకోలేదు. ప్రస్తుతం పంజాబ్ లో భగవంత్ మాన్ మేనియా నడుస్తోంది. ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.కాగా కేజ్రీవాల్ అరెస్ట్ తో పార్టీ అధ్యక్షుడిగా భగవంత్ మాన్ ఉంటారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం పంజాబ్ సీఎంగా ఆయన బాగానే పరిపాలించుకుంటున్నారు.