Rahul Gandhi : దేశ రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉండే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సడన్ గా కిచెన్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. నూతన సంవత్సర వేళ వీరిద్దరూ తయారు చేసిన ఆరెంజ్ మర్మలాడ్ రెసిపీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొత్త సంవత్సరం సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం అది వైరల్ గా మారింది. వీడియోలో సోనియా గాంధీ తన ఆహార ప్రాధాన్యతలను పంచుకున్నారు. వీడియోలో సోనియా, రాహుల్ గాంధీ తమ గార్డెన్ లోని నారింజ పండ్లు తెంపటానికి బాస్కెట్ తో వెళ్తూ కనిపించారు. బుట్టలోకి తెచ్చిన పండ్లను కిచెన్ లో క్లీన్ చేసి ఆరెంజ్ మార్మలాడ్ రెసిపీ తయారు చేయడానికి సిద్ధమయ్యారు. కిచెన్ లో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు సోనియా తనకు భారతీయ వంటకాలు నేర్చుకోవడానికి చాలా సమయం పట్టిందని, ముఖ్యంగా కారం తినడానికి చాలా సమయం పట్టింది అన్నారు. గతంలో ఎవరైనా భారతీయుడు విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆహారానికి అలవాటు పడలేరు.
అలాగే తాను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు భారతీయ వంటకాలకు ముఖ్యంగా మిర్చికి అలవాటు పడడానికి కొంత సమయం పట్టిందని ఆమె తెలిపారు. తాను ఎప్పుడూ విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన వెంటనే వండే వంటకం అర్హర్ కి దాల్, చావాల్ అని సోనియా అన్నారు. తర్వాత సంభాషణలో రాహుల్ బీజేపీ వాళ్లకు ఈ జామ్ అడిగితే వాళ్ళకి ఇద్దామా మమ్మీ అని అడిగారు. అందుకు సోనియా వాళ్లు మన మీదే విసురుతారు అనగానే ఇద్దరు గట్టిగా నవ్వుకున్నారు. అది కూడా మంచిదే మనం దాన్ని తిరిగి తీసుకోవచ్చు అని రాహుల్ బదులు ఇస్తారు. ఇది నా సోదరి ప్రియాంక చేసే వంటకం ఆమె దీన్ని మెరుగుపరిస్తే నేను దాన్ని ఫాలో మాత్రమే అవుతున్నాను అని రాహుల్ అన్నారు. దాదాపుగా ఐదు నిమిషాల నిడివి ఉండే ఈ వీడియోలో సోనియాగాంధీ రాహుల్ గాంధీలో తమకు చికాకు కలిగించేది ఏమిటో కూడా చెప్పారు. రాహుల్ చాలా మొండి వాడని, నేను కూడా అంతే అని, మేమిద్దరం అలాంటి వాళ్ళమే అని సోనియా చెప్పారు.
రాహుల్ లో తాను ఇష్టపడే విషయం కూడా ఆమె చెప్పారు. చాలా ఆప్యాయత కలిగినవాడని ఎదుటివారి పట్ల రాహుల్ శ్రద్ధ చూపిస్తాడని సోనియా అన్నారు. ముఖ్యంగా తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు రాహుల్, ప్రియాంకలు తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని సోనియా చెప్పారు. ఇంట్లో ఎవరు వంట బాగా చేస్తారనే దాని గురించి రాహుల్ మాట్లాడుతూ తన అమ్మమ్మ బాగా వంట చేస్తారన్నారు. అప్పట్లో తన తండ్రి కాశ్మీరీ బంధువుల నుంచి ఆమె చాలా నేర్చుకున్నారని కూడా చెప్పారు. తనకు ధనియాలంటే ఇష్టం లేదని సోనియా చెప్పారు. ఇప్పుడు ఆమె దాని చాలా ఇష్టపడతారని రాహుల్ అన్నారు. అలాగే తన తల్లి మొదట్లో పచ్చళ్ళు అంటే ఇష్టపడేది కాదని కానీ ఇప్పుడు బాగా ఇష్టపడతారని కూడా రాహుల్ చెప్పారు. రెసిపీ తయారు చేయడం పూర్తి కాగానే దానిని గాజు సీసాలోకి నింపారు. ప్రేమతో సోనియా, రాహుల్ అనే బ్రౌన్ పేపర్ మీద రాసిన మెసేజ్ ను ఆ సీసాలకు అతికించారు. అలా వీడియో ముగిసింది. ఇక ఈ వీడియోలో కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర క్యాంపేయిన్ లోగో కనిపిస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.