Railway Constable : రన్నింగ్ ట్రైన్‌లో నలుగురిని కాల్చి చంపిన రైల్వే కానిస్టేబుల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: July 31, 2023, 10:20 pm

Railway Constable : మహారాష్ట్ర – ముంబై, జైపూర్ ఎక్సప్రెస్‌లో పాలగర్ రైల్వే స్టేషన్ వద్ద ట్రైన్ రన్నింగ్‌లో ఉండగానే ఓ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు, మరో కానిస్టేబుల్ మృతి చెందారు. ఇటీవల దేశవ్యాప్తంగా రన్నింగ్ ట్రైన్ లలో చాలా దోపిడీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలువురు మరణిస్తూ ఉన్నరు. అయితే ముగ్గురు ప్రయాణికులతో పాటు ఒక కానిస్టేబుల్ మృతి చెందడంతో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

సాధారణంగా కానిస్టేబుల్స్ కాల్ పూలు జరిపితే దుండగులు మరణిస్తారు. కానీ ప్రయాణికులతో పాటు మరో కానిస్టేబుల్ మృతి చెందడంతో.. పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జరిగిన ఈ దుర్ఘటనపై రైల్వే పోలీస్ శాఖ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కాల్పులు జరిగిన కంపార్ట్మెంట్లోని ప్రయాణికులు అందరిని విచారించడానికి రెడీ అవుతున్నారు. జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించడం జరిగింది. చాలా రైలు ప్రయాణిస్తూ ఉండగా దోపిడీదారులు దొంగతనాలకు పాల్పడటంతో పాటు కొన్నిసార్లు టికెట్ కలెక్టర్లపై కూడా దాడులు చేస్తున్నారు.

railway constable who shot in running train

railway constable who shot in running train

ఈ క్రమంలో తాజాగా జైపూర్ ఎక్స్ప్రెస్ లో జరిగిన దాడికి గల కారణం దోపిడీ లేదా టికెట్ కలెక్టర్ల పై దాడి సమయంలో కానిస్టేబుల్స్ గొడవపడి ఆపే ప్రయత్నంలో ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Also read

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp