RBI : ఒకే ఫోన్ నెంబర్ తో రెండు బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్నవారికి హెచ్చరిక...!
RBI : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ ఖాతా ను కలిగి ఉన్నారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి కనీసం ఒక బ్యాంకు ఖాతా ఉంటుంది. ఎందుకంటే నేటి కాలంలో బ్యాంకు ఖాతా లేకుండా ఏ పని జరగడం లేదు. అయితే బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి అనే నిబంధన అయితే లేదు కానీ ప్రభుత్వ హామీలు పొందాలంటే కచ్చితంగా బ్యాంకు ఖాతా ఉండాల్సిందే. అంతేకాక ఒకే నెంబర్ తో మరిన్ని ఖాతాలు కూడా తెరవడానికి అవకాశం ఉండడంతో చాలా మంది అనేక రకాల బ్యాంకు ఖాతాలను తీసుకుంటున్నారు. అలాగే కొందరు ఉద్యోగరీత్యా బ్యాంకు ఖాతాలను తీసుకుంటుంటే , మరి కొంతమంది హోమ్ లోన్ ,వెహికల్ లోన్ కోసం బ్యాంకు ఖాతాలను తీసుకుంటూ ఉంటారు.
అయితే ఈ రోజుల్లో ప్రజల యొక్క సొమ్ముకు భద్రత కల్పించేందుకు ఆర్బిఐ కూడా బ్యాంకులకు కఠిన చర్యలను అమలు చేస్తూ వస్తుంది. దీంతో చాలామంది వారి యొక్క సొమ్మును బ్యాంకులలో భద్రపరిచేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే బ్యాంకుల సహకారంతో ఆర్.బి.ఐ కూడా ఖాతాల భద్రతలో మార్పులు తీసుకురావడానికి కొత్త నిబంధనలను అమలు చేస్తూ వస్తుంది. అయితే నేటి కాలంలో చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న వారికి ఆర్బిఐ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది.
అయితే ఈ రోజుల్లో బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డు మరియు మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేయడం తప్పనిసరి. ఇదే సమయంలో ఎక్కువ ఖాతాలు కలిగి ఉన్న వారు కూడా ఒకే మొబైల్ నెంబర్ ను అన్నిచోట్ల నమోదు చేస్తున్నారు. అయితే ఇకపై అలా కుదరదని ఆర్బిఐ స్పష్టం చేస్తుంది.అయితే మీరు కొత్తగా బ్యాంకు ఖాతాను తెరిచినప్పుడు కచ్చితంగా KYC ఫారమ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఆర్.బి.ఐ కేవైసీ యొక్క ప్రమాణాలు నియమాలను కూడా మార్చడం జరిగింది. ఈ క్రమంలోనే ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉండి ఒకే నెంబర్ కు లింక్ చేసిన ఖాతాదారులకు కేవైసీ చేయించుకోమని అప్డేట్ చేయవచ్చు. ఉమ్మడి ఖాతాలు కలిగి ఉన్నట్లయితే మరో మొబైల్ నెంబర్ ను కేవైసీ ఫారమ్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
RBI : ఒకే ఫోన్ నెంబర్ తో రెండు బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్నవారికి హెచ్చరిక…!
అయితే ఈ రోజుల్లో బ్యాంక్ ఖాతా తెరవాలి అంటే కచ్చితంగా కేవైసీ అవసరం అవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి బ్యాంకు ఖాతాను తెరిచినప్పుడు అతను ఇచ్చిన సమాచారం సరైనదే అని తెలుసుకోవడానికి కేవైసీ తప్పనిసరిగా చేపించాలి. అందుకే కొత్తగా ఖాతాలను తీసుకునేవారు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలని బ్యాంకులు వినియోగదారులకు తెలియజేస్తున్నాయి.
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.