7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా సందర్భంగా డబుల్ దమాకా.. భారీగా పెరిగిన జీతాలు
7th Pay Commission : ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. జులైలోనే డీఏ పెరగాల్సి ఉంది. కానీ.. రెండో డీఏ ఇప్పటి వరకు పెరగలేదు. ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏ పెరుగుతుంది. జనవరి, జులై రెండు సార్లు డీఏ పెరుగుతుంది. ఈ సంవత్సరం జనవరిలో పెరగాల్సిన డీఏ.. మార్చిలో పెరిగింది. ఆ తర్వాత డీఏ జులైలో పెరగాల్సి ఉంది. కానీ.. ఇంకా జులైలో పెరగలేదు. దసరా, దీపావళి సందర్భంగా డీఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇంకా కేంద్రం డీఏను పెంచకముందే తెలంగాణ ప్రభుత్వం డీఏ పెంపును తాజాగా ప్రకటించింది. దసరా కానుకగా ఫెస్టివల్ బొనాంజా పేరుతో ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంపును ప్రకటించింది.
టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ డీఏ పెంపును ప్రకటించారు. 4.8 శాతం డీఏను పెంచుతున్నట్టు ఆయన వెల్లడించారు. డీఏ పెంపు ఈ సంవత్సరం జులై నుంచి అమలులోకి రానుంది. ఆర్టీసీ ఉద్యోగులకు అక్టోబర్ జీతంతో పాటే డీఏ కూడా పెరిగి.. అక్టోబర్ జీతంతో రానుంది. 2019 నుంచి ఇప్పటి వరకు టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు 9 డీఏలను ఇన్‌స్టాల్‌మెంట్స్ లో ఇస్తున్నారు. అక్టోబర్ జీతంతో పెరిగిన డీఏను కూడా యాడ్ చేసి ఉద్యోగులకు దసరా కానుకగా పెరిగిన జీతం అందిస్తాం అని సజ్జనార్ చెప్పుకొచ్చారు.
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుపై ప్రకటన ఎప్పుడు?
మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుపై ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. దసరా తర్వాత దీపావళికి కేంద్ర ప్రభుత్వ డీఏ పెంపు ప్రకటనను వెలువరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డీఏ పెంపుపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం డీఏ 42 శాతంగా ఉంది. ఈసారి 3 లేదా 4 శాతం డీఏ పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.