Union Budget 2026 Women’s : కేంద్ర బడ్జెట్‌లో మహిళలకు అదిరే శుభవార్త.. రూ.5 లక్షల వడ్డీ లేని రుణాలు..!

 Authored By suma | The Telugu News | Updated on :1 February 2026,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Union Budget 2026 Women's : కేంద్ర బడ్జెట్‌లో మహిళలకు అదిరే శుభవార్త.. రూ.5 లక్షల వడ్డీ లేని రుణాలు..!

  •  Budget 2026-27 : మహిళలకు అదిరే శుభవార్త.. రూ.5 లక్షల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు..

Union Budget 2026 Women’s  : పార్లమెంటులో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను Nirmala Sitharaman Budget 2026 ప్రవేశపెట్టిన సందర్భంగా దేశవ్యాప్తంగా మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళల ఆర్థిక స్వావలంబనను లక్ష్యంగా పెట్టుకుని అమలు చేస్తున్న లక్‌పతీ దీదీ యోజనను మరికొంత కాలం పాటు కొనసాగించనున్నట్లు ప్రకటించారు. 2024లో ప్రారంభమైన ఈ పథకం విశేష ఫలితాలు సాధించడంతో దీన్ని విస్తరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా స్వయం ఉపాధి కలిగిన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ పథక ప్రధాన ఉద్దేశం…

Union Budget 2026 Women's : కేంద్ర బడ్జెట్‌లో మహిళలకు అదిరే శుభవార్త.. రూ.5 లక్షల వడ్డీ లేని రుణాలు..!

Union Budget 2026 Women’s : కేంద్ర బడ్జెట్‌లో మహిళలకు అదిరే శుభవార్త.. రూ.5 లక్షల వడ్డీ లేని రుణాలు..!

Union Budget 2026 Women’s  : లక్‌పతీ దీదీ యోజన నేపథ్యం..

కేంద్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో తొలిసారిగా లక్‌పతీ దీదీ యోజనను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తరువాతి దశలో ఈ లక్ష్యాన్ని 3 కోట్ల మహిళల వరకు పెంచడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం సహాయక బృందాల (SHGs) ద్వారా చిన్న వ్యాపారాలు ప్రారంభించి వార్షికంగా కనీసం లక్ష రూపాయల ఆదాయం పొందేలా చేయడం ఈ పథకం ఉద్దేశం. ఇప్పుడు మరోసారి ఈ స్కీమ్‌కు పొడిగింపు ఇవ్వడం ద్వారా మహిళల ఉపాధి అవకాశాలను మరింత విస్తరించనున్నారు.

Union Budget 2026 Women’s : వడ్డీ లేని రుణాలు.. శిక్షణే ప్రధాన బలం

లక్‌పతీ దీదీ యోజనలో భాగంగా మహిళలకు రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు అందజేస్తారు. ఈ రుణాలు పూర్తిగా స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు మాత్రమే లభిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి పొదుపు చేస్తూ బ్యాంకుల ద్వారా రుణాలు పొందే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. అంతేకాకుండా మహిళలు ఎంచుకున్న వ్యాపార రంగానికి అనుగుణంగా శిక్షణ కూడా ఇస్తారు. ఉత్పత్తి తయారీ, నాణ్యత, ప్యాకేజింగ్, మార్కెటింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించడం ద్వారా వారిని సంపూర్ణ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతారు.

Union Budget 2026 Women’s : కమ్యూనిటీ మార్ట్స్.. మార్కెట్ అవకాశాలు

ఈ పథకం కింద క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్లలో కమ్యూనిటీ ఆధారిత రిటైల్ ఔట్లెట్లు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. వీటిని “సెల్ఫ్ హెల్ప్ ఎంటర్‌ప్రూనర్ మార్ట్స్”గా అభివృద్ధి చేస్తారు. దీని ద్వారా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు నేరుగా మార్కెట్ లభిస్తుంది. లక్‌పతీ దీదీ యోజనను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. మహిళలకు సరైన మార్గదర్శకత్వం మార్కెట్ లింకేజీలు కల్పించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి