Nirmala Sitharaman Budget 2026 : నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్… ధరలు తగ్గేవి..పెరిగేవి ఇవే..!
ప్రధానాంశాలు:
Nirmala Sitharaman Budget 2026 : నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్... ధరలు తగ్గేవి..పెరిగేవి ఇవే..!
Nirmala Sitharaman Budget 2026 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ Nirmala Sitharaman వరుసగా తొమ్మిదవసారి కేంద్ర బడ్జెట్‌ను union budget 2026 ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌తో సామాన్య ప్రజలపై పడే ఆర్థిక ప్రభావం ఏంటి? ఏ వస్తువులు చౌక అవుతాయి? ఏవి ఖరీదవుతాయి? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. బడ్జెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాల వల్ల కొన్ని రంగాలకు ఊరట లభించగా పన్ను నిబంధనల విషయంలో మాత్రం కఠిన వైఖరి కనిపిస్తోంది.
Nirmala Sitharaman Budget 2026 : నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్… ధరలు తగ్గేవి..పెరిగేవి ఇవే..!
Nirmala Sitharaman Budget 2026 ధరలు తగ్గే అవకాశమున్నవి..
. బడ్జెట్‌లో డ్యూటీలు, ట్యాక్సులు తగ్గించడం వల్ల ఈ కింది వస్తువులు, సేవలు చౌకగా లభించే అవకాశం ఉంది:
విదేశీ పర్యటన ప్యాకేజీలు..
. టిసిఎస్ రేటు 5–20% నుంచి కేవలం 2%కి తగ్గింపు
విదేశీ విద్య ఖర్చులు..
. ఎల్ఆర్ఎస్ పరిధిలో విద్యా ఖర్చులపై తక్కువ టిడిఎస్
మద్యం తయారీకి ఉపయోగించే స్క్రాప్, ఖనిజాలు..
. డ్యూటీ 5% నుంచి 2%కి తగ్గింపు
షూ అప్పర్ ఎగుమతులు..
. డ్యూటీ లేకుండా దిగుమతులకు అనుమతి
ఎనర్జీ ట్రాన్సిషన్ పరికరాలు..
. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) నుంచి మినహాయింపు
సోలార్ గ్లాస్ తయారీకి అవసరమైన వస్తువులు..
. బిసిడి నుంచి పూర్తిగా మినహాయింపు
కీలక ఖనిజాల తయారీలో వాడే క్యాపిటల్ గూడ్స్..
. బిసిడి మినహాయింపు
సివిలియన్ విమానాల విడిభాగాలు..
. దిగుమతులపై బిసిడి మినహాయింపు
మైక్రోవేవ్ ఓవెన్లు..
. కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు
వ్యక్తిగత అవసరాల కోసం దిగుమతి చేసే వస్తువులు..
. బిసిడి 20% నుంచి 10%కి తగ్గింపు
అరుదైన వ్యాధులు, క్యాన్సర్ చికిత్స మందులు
. బిసిడి మినహాయింపు
భారతీయ జలాల్లో పట్టిన చేపలు
. కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు
న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుల కోసం దిగుమతులు
. బిసిడి మినహాయింపు
ధర పెరిగినవి లేదా కఠినతరం అయిన అంశాలు..
బడ్జెట్‌లో కొన్ని నిర్ణయాలు పన్ను చెల్లింపుదారులకు హెచ్చరికగా మారాయి:
ఇన్‌కమ్ టాక్స్ వివరాల్లో తప్పుడు వెల్లడి
. పన్ను మొత్తానికి సమానంగా 100% జరిమానా
చరాస్తుల వివరాలు దాచిపెట్టడం
. ఇకపై దీనిపైనా జరిమానా తప్పదు
స్టాక్ ఆప్షన్స్..ఫ్యూచర్స్ ట్రేడింగ్
. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ 0.02% నుంచి 0.05%కి పెంపు
ఇక బడ్జెట్ 2026 సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా కొన్ని వస్తువులు సేవల ధరలు తగ్గించడం ఈ బడ్జెట్‌లో స్వాగతార్హమైన అంశం. అయితే పన్ను నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న స్పష్టమైన సంకేతాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే సౌకర్యాలు ఉన్నాయి కానీ నియమాలు తప్పనిసరి.