Union Budget 2026 Telangana : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పై భారీ వరాలు.. హైస్పీడ్ రైల్వే కారిడార్లతో కొత్త అభివృద్ధి దిశ..!

 Authored By suma | The Telugu News | Updated on :1 February 2026,12:22 pm

ప్రధానాంశాలు:

  •  Union Budget 2026 Telangana : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పై భారీ వరాలు.. హైస్పీడ్ రైల్వే కారిడార్లతో కొత్త అభివృద్ధి దిశ..!

Union Budget 2026  Telangana : కేంద్ర ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ Budget 2026-27 ను ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. ఈ మేరకు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ Nirmala Sitharaman ఈ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో హైదరాబాద్‌కు వరాలు ప్రకటించారు. వరుసగా తొమ్మిదోసారి పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మొత్తం ఏడు హైస్పీడ్ రైల్వే కారిడార్ల అభివృద్ధిని ప్రకటించగా వాటిలో మూడు మార్గాలు హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని ఉండటం విశేషం. ఇది తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను దేశంలోని ప్రధాన ఆర్థిక, సాంకేతిక నగరాలతో మరింత బలంగా అనుసంధానించనుంది.

Union Budget 2026 : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పై భారీ వరాలు.. హైస్పీడ్ రైల్వే కారిడార్లతో కొత్త అభివృద్ధి దిశ..!

Union Budget 2026 : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పై భారీ వరాలు.. హైస్పీడ్ రైల్వే కారిడార్లతో కొత్త అభివృద్ధి దిశ..!

Union Budget 2026 Telangana : పర్యావరణ హితం..వేగవంతమైన రవాణా లక్ష్యం

పర్యావరణానికి హాని కలగకుండా ప్రయాణికులకు వేగవంతమైన మరియు సమర్థవంతమైన రవాణా అందించడమే లక్ష్యంగా ఈ హైస్పీడ్ రైల్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే విధంగా ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకోనున్నాయి. రోడ్డు మరియు విమాన ప్రయాణాలపై ఒత్తిడి తగ్గి స్వచ్ఛమైన రవాణా వ్యవస్థలు ప్రోత్సాహం పొందనున్నాయి. ఈ కారిడార్లు కేవలం రవాణా మార్గాలుగా మాత్రమే కాకుండా “గ్రోత్ కనెక్టర్లుగా” పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Union Budget 2026 Telangana : ఏడు కారిడార్లు..దేశ అభివృద్ధికి బలమైన అనుసంధానం

ప్రతిపాదించిన హైస్పీడ్ రైల్వే మార్గాల్లో ముంబై–పూణే, పూణే–హైదరాబాద్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై, చెన్నై–బెంగళూరు, ఢిల్లీ–వారణాసి, వారణాసి–సిలిగురి ఉన్నాయి. ఇవన్నీ కలిపి దేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాలు, ఐటీ హబ్‌లు, మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలను ఒకే శృంఖలలో కట్టిపడేస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై వంటి టెక్నాలజీ కేంద్రాలకు హైస్పీడ్ కనెక్టివిటీ పెరగడం వల్ల పెట్టుబడులు ఉపాధి అవకాశాలు మరింతగా విస్తరించనున్నాయి. ప్రాంతీయ అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు కీలక మైలురాయిగా నిలవనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి