BJP : ఢిల్లీ వెళ్ళిన పురందేశ్వరి.. పొత్తుపై బీజేపీ నిర్ణయం ఏంటి..?
BJP : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇటీవల ఢిల్లీకి వెళ్లారు. దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లకు టెన్షన్ మొదలైంది. అయితే పురందేశ్వరి తో పాటు బీజేపీలోని అగ్ర నాయకులు ఢిల్లీకి వెళ్లారు. అయితే బీజేపీ హై కమాండ్ ఒక్కొక్క రాష్ట్రం నుంచి అధ్యక్షులను పార్టీ క్యాడర్ ను ఢిల్లీకి పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కోరోజు మీటింగ్ జరగగా తాజాగా బుధవారం ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ నాయకులతో మీటింగ్ జరిపింది హై కమాండ్. ఈ మీటింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు తలరాతలు మారనున్నాయని అంటున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తలరాతలు ఢిల్లీలో డిసైడ్ అవుతుందని అంటున్నారు.
ఏపీకి సంబంధించిన కొన్ని రిపోర్టులను బీజేపీ లీడర్స్ ఢిల్లీకి తీసుకువెళ్లారు. వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే పరిస్థితి ఇలా ఉంటుంది అని, పొత్తు పెట్టుకోకపోతే ఇట్లా ఉంటుంది పరిస్థితి అని ఒక రిపోర్ట్ ను బీజేపీ లీడర్లు బీజేపీ హై కమాండ్ కి తెలియజేశారని అంటున్నారు. మీటింగ్లో లోకల్ క్యాడర్ చెప్పే మాటలను హైకమాండ్ వినిపించుకుంటుంది. ఇక చంద్రబాబు నాయుడు దగ్గరి బంధువు పురందేశ్వరి కాబట్టి ఆమె మాటలను బీజేపీ హై కమాండ్ కచ్చితంగా వింటుంది. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ గా నిలిచారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఎన్నికల గెలిచిన తర్వాత బీజేపీని పక్కన పెట్టారు. దీంతో కేంద్రం వీటన్నింటిని చెక్ చేసుకుంటుంది. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత కేంద్రం తీసుకునే నిర్ణయంతో ఆ ముగ్గురు తలరాతలు మారబోతున్నాయని అంటున్నారు. ఇక చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. ఈ తరుణంలో బీజేపీ హై కమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఏపీలో బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లను ప్రకటించిన కేంద్రం ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎంపీ సీట్లు ఖరారు చేయలేదు. ఈ క్రమంలోనే పొత్తు ఉందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ బీజేపీ జనసేన తో పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు ఈ పొత్తు కొనసాగుతుందా లేదా అనేది చర్చనీయాంశమైంది. అయితే పొత్తు కచ్చితంగా ఉంటుందని కొందరు అంటున్నారు. ఇక బీజేపీతో పొత్తు ఉంటే వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓటమి తప్పదు అని అంటున్నారు. మరి పొత్తుపై బీజేపీ హై కమాండ్ నరేంద్ర మోడీ, జేడీ నడ్డా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మరికొన్ని గంటలో తెలియనుంది. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన ఏపీ బీజేపీ లీడర్లు అక్కడ మీటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో నిర్ణయం ఏంటనేది బీజేపీ హై కమాండ్ తెలియజేయునది.