దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న ఇంధనల ధరలు సామాన్యులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌తోపాటు వంట గ్యాస్ ధరలు కూడా బాగా పెరిగాయి. ఈ క్రమంలో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంధన ధరలను చెల్లించేందుకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు కరోనా వల్ల ఇప్పటికే తీవ్రమైన నష్టాలు, సమస్యల్లో ఉన్నవారిపై పెరుగుతున్న ఇంధన ధరలు గుదిబండగా మారాయి.
దేశంలో అంతలా ధరలు పెరిగిపోతున్న వాటిని ప్రభుత్వాలు ఎందుకు తగ్గించడం లేదు ? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. ప్రభుత్వాలు నడిచేది ప్రజలు చెల్లించే పన్నుల వల్లే. అందువల్ల వాటిని తగ్గించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం ధోరణినే అనుసరిస్తున్నాయి. ఫలితంగా ధరలు తగ్గడం లేదు.
ఇక కరోనా నేపథ్యంలో గతేడాది చమురు సంస్థలకు నష్టాలు వచ్చాయి. వాడకం తక్కువైంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. దీంతో చమురు సంస్థలు నష్టాలను చవిచూశాయి. ఈ క్రమంలో సౌదీ అరేబియా ఆ నష్టాలను పూడ్చుకునేందుకు నిత్యం ఉత్పత్తి చేసే చమురు పరిమాణాన్ని తగ్గించింది. తక్కువ చమురును వెలికి తీస్తోంది. దీంతో సహజంగానే డిమాండ్ పెరిగింది. ఫలితంగా ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే మరికొంత కాలం ఇదే తీరు కొనసాగే అవకాశం ఉంది. ఆ తరువాతే ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
మన దేశంలో ఇంధన ధరలు అంతర్జాతీయ మార్కెట్లను బట్టి మారుతుంటాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరిగితే ఇక్కడ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరుగుతాయి. చమురు ధర తగ్గితే ఆ ధరలు తగ్గుతాయి. కానీ చమురు ధరలు పెరుగుతున్నందునే ఇంధన ధరలు కూడా పెరుగుతున్నాయి. కనుకనే రేట్లు తగ్గడం లేదు. మరి భవిష్యత్తులో అయినా ఇంధన ధరలు తగ్గుతాయా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తాయని అందరికీ తెలిసిందే. అంతేకాదు కొన్ని…
Donald Trump : ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలవడం మనం చూశాం. ట్రంప్ గెలుపుపై భారత…
Rahul Gandhi : జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గానీ, ఆయన…
Castes In Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లో కలిపి మొత్తం 243…
IAS Officers : పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం 13 మంది IAS అధికారులను బదిలీ చేసింది. ఉప…
Samantha : సమంత క్రేజ్ అప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. మయోసైటిస్ వలన కొన్నాళ్లు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన…
Janasena : మత్స్యకారుల ఉనికికి, ఉపాధికి విఘాతం కలిగించే జీవో నెం.217ను రద్దు చేయాలని గత ప్రభుత్వంని టీడీపీ నాయకులు,…
Bigg Boss Telugu 8 : సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌజ్లో నామినేషన్ రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో…
This website uses cookies.