సెలబ్రిటీల పిల్లలు అనగానే సమాజంలో సహజంగానే ఒకింత ఆసక్తి ఉంటుంది. తమ తల్లిదండ్రుల్లాగే వారూ ఏదైనా రంగంలో రాణించి ప్రజల మెప్పు పొందుతారా ? అసలు ఏం చేస్తారు ? అని తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే సినిమాల విషయానికి వస్తే ప్రేక్షకులు ఆదరించాలి. అప్పుడే సెలబ్రిటీల పిల్లలు అయినా, ఇంకొకరు అయినా నటులుగా గుర్తింపు పొందుతారు. కానీ మరి.. క్రికెట్ విషయానికి వస్తే..? అది సినిమా కాదు కదా.. కచ్చితంగా నైపుణ్యం ఉండాలి. దాంతో రాణిస్తేనే గుర్తింపు లభిస్తుంది. కానీ ఏ నైపుణ్యం లేకపోయినప్పటికీ సెలబ్రిటీల పిల్లలు అంటే మీడియా వారిని అతి చేసి చూపిస్తుంటుంది. జనాలపై వారిని బలవంతంగా రుద్దాలని, జనాలచే యాక్సెప్ట్ చేయించాలని, ఆహో.. ఓహో.. అనిపించాలని తపిస్తుంటుంది. సచిన్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ విషయంలోనూ ఇప్పుడిలాగే జరుగుతుందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 వేలం పాటను ఇటీవల నిర్వహించగా అందులో అర్జున్‌ను ఎవరూ కొనలేదు. దీంతో పాపం పోనీలే.. అని ముంబై ఇండియన్స్ రూ.20 బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. సచిన్ ఆ టీంకు సలహాదారుడు. కనుక సచిన్ మెప్పు పొందాలనో, మరో కారణమో తెలియదు కానీ.. అర్జున్ ను మాత్రం ముంబై కొనుగోలు చేసింది. అయితే అతన్ని కొన్నాక ఆ టీంకు చెందిన కొందరు కామెంట్లు చేశారు. అర్జున్‌లో ఉన్న స్కిల్‌ను చూసే కొన్నామని చెప్పారు. కానీ లోపల వారికి కూడా తెలుసు. ఎందుకు కొన్నారో. అయితే దాని గురించి పక్కన పెడితే.. నిజంగా అర్జున్‌లో అంత స్కిల్ ఉందా..? అంటే..
ఐపీఎల్ వేలంలో రిజిస్టర్ చేసుకునేందుకు ప్లేయర్లు దేశవాళీ టోర్నీల్లో ఆడి ఉండాలి. కానీ అర్జున్ జనవరి వరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక ఐపీఎల్ వేలంలో ఉండాలని చెప్పి కాబోలు.. జనవరి నెలలో రెండంటే రెండు మ్యాచ్‌లు ఆడాడు. వాటిల్లో అర్జున్ పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాటింగ్ పరంగా చూస్తే 2 మ్యాచ్ లలో కేవలం 3 పరుగులే చేశాడు. బౌలింగ్ పరంగా చూస్తే 42 బాల్స్ వేసి 67 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. దేశవాళీ టోర్నీల్లో ఇది చాలా పేలవమైన ప్రదర్శన అని చెప్పాలి. అయినప్పటికీ అర్జున్ టెండుల్కర్‌కు ఐపీఎల్‌లో చోటు దక్కిందంటే.. లోగుట్లు పెరుమాళ్ల కెరుక అన్నట్లు.. ఆ గుట్టు కూడా ఆ దేవుడికే తెలియాలి.
దేశవాళీ టోర్నీల్లో ఎంతో అద్భుతమైన ప్రదర్శన ఇస్తే గానీ జాతీయ జట్టులో, ఐపీఎల్‌లో చోటు దక్కదు. ఐపీఎల్ అనేది కేవలం డబ్బుతో ముడిపడి ఉన్న అంశం. అక్కడ స్కిల్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఫలానా ఆటగాడు ఇటీవలి కాలంలో ఎన్ని మ్యాచ్‌లు ఆడాడు. ఎన్ని పరుగులు చేశాడు. ఎన్ని వికెట్లు తీశాడు. ఈ గణాంకాలను బట్టి ప్లేయర్ నైపుణ్యాలను నిర్దారించి జట్టులోకి తీసుకుంటారు. ఇందుకు ప్లేయర్లు ఎంతో కష్టపడతారు. కానీ అర్జున్‌కు మాత్రం అలాంటి కష్టం ఏమీ లేకుండానే రిజిస్టర్ చేసుకున్న తొలిసారే ఐపీఎల్ లో ఆడేందుకు అర్హత లభించిందంటే.. వెనుక ఏం జరిగి ఉంటుందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
అయితే సచిన్‌ను క్రికెట్ దేవుడిగా ఆరాధిస్తాం. రిటైర్ అయినా అతను ఇప్పుడు మళ్లీ బ్యాట్ పట్టుకుంటే మైదానంలోకి వచ్చి ఈలలు వేస్తూ చప్పట్లు కొడతాం. ఎందుకంటే సచిన్ \దిగ్గజ ఆటగాడు. కెరీర్ తొలినాళ్లలోనే తానేంటో తాను రుజువు చేసుకున్నాడు. అందుకని సచిన్ అంటే అభిమానం ఇప్పటికీ ఎప్పటికీ తగ్గదు. కానీ స్కిల్స్ లేకున్నప్పటికీ కేవలం సచిన్ కుమారుడు అన్న ట్యాగ్ ఆధారంగా అర్జున్‌ను మీడియా అంతలా పైకి లేపడం, అతనికి అంత హైప్ సృష్టించడం మంచిది కాదు. రేప్పొద్దున అతను ఫెయిలైతే ఆ అపవాదు అతనికి కాదు, అతని తండ్రి సచిన్‌కు వస్తుంది. కనుక సెలబ్రిటీల పిల్లలు అయినా, మరొకరు అయినా ముందే అంత హైప్ సృష్టించాల్సిన పనిలేదు. వారు రాణిస్తే మీడియా హైప్ చేసినా చేయకపోయినా వారికి వచ్చే గుర్తింపు వారికి కచ్చితంగా వస్తుంది. ఇవ్వాళ, రేపు సెలబ్రిటీల పిల్లలకు గుర్తింపు తెచ్చుకోవడం అన్నది పెద్ద కష్టం కాదు. కేవలం వారి స్కిల్ మీద అది ఆధార పడి ఉంటుంది. కనుక వారి మానాన వారిని వదిలేసి వారు రాణించిననాడు వారిని పొడిగితే మంచిది. లేదంటే మీడియా అభాసు పాలు కావల్సి వస్తుంది.
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
Tollywood Actors : టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో కనిపించడం చాలా అరుదు. ప్రత్యేక సందర్భాలలో వారు కలిసి…
This website uses cookies.