దేశంలో ఇంధ‌న ధ‌ర‌లు అంత‌లా ఎందుకు పెరుగుతున్నాయి ? ప‌్ర‌భుత్వం ప‌న్నుల‌ను ఎందుకు త‌గ్గించ‌డం లేదు ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

దేశంలో ఇంధ‌న ధ‌ర‌లు అంత‌లా ఎందుకు పెరుగుతున్నాయి ? ప‌్ర‌భుత్వం ప‌న్నుల‌ను ఎందుకు త‌గ్గించ‌డం లేదు ?

 Authored By maheshb | The Telugu News | Updated on :20 February 2021,6:20 pm

దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న ఇంధ‌న‌ల ధ‌ర‌లు సామాన్యుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌తోపాటు వంట గ్యాస్ ధ‌ర‌లు కూడా బాగా పెరిగాయి. ఈ క్ర‌మంలో సామాన్య ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. ఇంధ‌న ధ‌ర‌ల‌ను చెల్లించేందుకు తీవ్ర‌మైన ఇబ్బందులు ప‌డుతున్నారు. ఓవైపు క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టికే తీవ్ర‌మైన న‌ష్టాలు, స‌మ‌స్య‌ల్లో ఉన్న‌వారిపై పెరుగుతున్న ఇంధ‌న ధ‌ర‌లు గుదిబండ‌గా మారాయి.

why fuel prices are not decreasing in india

why fuel prices are not decreasing in india

దేశంలో అంతలా ధ‌ర‌లు పెరిగిపోతున్న వాటిని ప్ర‌భుత్వాలు ఎందుకు త‌గ్గించ‌డం లేదు ? అని సామాన్యులు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే దీనిపై ఇప్ప‌టికే కేంద్ర చ‌మురు శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజ్య‌స‌భ‌లో స‌మాధానం ఇచ్చారు. ప్ర‌భుత్వాలు న‌డిచేది ప్ర‌జ‌లు చెల్లించే ప‌న్నుల వ‌ల్లే. అందువ‌ల్ల వాటిని త‌గ్గించేది లేద‌ని తేల్చి చెప్పారు. దీంతో ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా కేంద్రం ధోర‌ణినే అనుస‌రిస్తున్నాయి. ఫ‌లితంగా ధ‌ర‌లు త‌గ్గ‌డం లేదు.

ఇక క‌రోనా నేప‌థ్యంలో గతేడాది చ‌మురు సంస్థ‌ల‌కు న‌ష్టాలు వ‌చ్చాయి. వాడ‌కం త‌క్కువైంది. అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గాయి. దీంతో చ‌మురు సంస్థ‌లు న‌ష్టాల‌ను చ‌విచూశాయి. ఈ క్ర‌మంలో సౌదీ అరేబియా ఆ న‌ష్టాల‌ను పూడ్చుకునేందుకు నిత్యం ఉత్ప‌త్తి చేసే చ‌మురు ప‌రిమాణాన్ని తగ్గించింది. త‌క్కువ చ‌మురును వెలికి తీస్తోంది. దీంతో స‌హ‌జంగానే డిమాండ్ పెరిగింది. ఫ‌లితంగా ధ‌ర‌లు కూడా పెరుగుతున్నాయి. అయితే మరికొంత కాలం ఇదే తీరు కొన‌సాగే అవ‌కాశం ఉంది. ఆ త‌రువాతే ధ‌ర‌లు త‌గ్గుతాయ‌ని అంచనా వేస్తున్నారు.

మ‌న దేశంలో ఇంధ‌న ధ‌ర‌లు అంత‌ర్జాతీయ మార్కెట్ల‌ను బ‌ట్టి మారుతుంటాయి. అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర పెరిగితే ఇక్క‌డ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధ‌ర‌లు పెరుగుతాయి. చ‌మురు ధ‌ర త‌గ్గితే ఆ ధ‌ర‌లు త‌గ్గుతాయి. కానీ చ‌మురు ధ‌ర‌లు పెరుగుతున్నందునే ఇంధ‌న ధ‌రలు కూడా పెరుగుతున్నాయి. క‌నుకనే రేట్లు త‌గ్గడం లేదు. మ‌రి భ‌విష్య‌త్తులో అయినా ఇంధ‌న ధ‌ర‌లు త‌గ్గుతాయా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.

maheshb

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది