Modi : ఆ ఒక్క నిర్ణయం మోడీ తీసుకుంటే , చంద్రబాబు తలరాత మారిపోతుంది !
Modi : ప్రస్తుతం దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. అందుకే బీజేపీ ఏ పార్టీకి స్నేహహస్తం అందిస్తే ఆ పార్టీకి ప్రాముఖ్యత వస్తుంది. అందుకే ఎన్డీఏ మిత్రపక్షాలకు బీజేపీ స్నేహహస్తం అందిస్తోంది. మరి.. అదే స్నేహ హస్తాన్ని టీడీపీ కూడా కోరుకుంటోంది. కానీ.. బీజేపీ టీడీపీని చేరదీస్తుందా అనేదే పెద్ద డౌట్. ఎందుకంటే.. బీజేపీ టీడీపీని నమ్మే పరిస్థితులు ఇప్పుడు లేవు. కానీ.. ఇది ఎన్నికల యుగం. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ కూడా ఎప్పుడు ఎలాంటి స్టెప్ వేస్తుందో తెలియదు.
అందుకే.. బీజేపీ ఇప్పటి నుంచే తన మిత్రపక్షాలతో టచ్ లో ఉంటోంది. ఎన్డీయే మిత్ర పక్షాలను మచ్చిక చేసుకునే పనిలో పడింది. అందులో భాగంగానే టీడీపీని చేరదీస్తుందా అనేదే డౌట్. నిజానికి.. టీడీపీ ఒకప్పుడు ఎన్టీఏలో భాగస్వామినే. కానీ.. 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందే.. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ఎన్డీఏ మిత్రపక్షం నుంచి వైదొలిగారు. అప్పటి నుంచి బీజేపీ, టీడీపీ మధ్య సంబంధాలు తెగిపోయాయి.కానీ.. ఇప్పుడు బీజేపీ.. ఎన్డీఏకు దూరమైన పార్టీలతో దగ్గరవుతోంది. వాటితో రాయబారాలు ప్రారంభించింది. దానికి సంబంధించి ఎన్డీఏ మిత్రపక్షాల భేటీ కూడా జరగనుంది. మరి ఆ భేటీకి టీడీపీ హాజరవుతుందా.. లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
Modi : ఎన్డీఏకి దూరమైన పార్టీలతో దగ్గరవుతున్న బీజేపీ
2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. అందుకే.. జులై 18న ఎన్డీఏ మిత్రపక్షాలతో బీజేపీ సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో చాలా పార్టీలకు ఆహ్వానం వెళ్లింది. మరి ఈ భేటీకి టీడీపీ హాజరవుతుందా లేదా అనేదే పెద్ద ట్విస్ట్ గా మారింది. ప్రస్తుతం ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ ఈ రెండు పార్టీలు కూడా బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయి. జనసేన కూడా బీజేపీతో పొత్తులోనే ఉంది. కానీ.. టీడీపీకి అసలు ఎలాంటి ఆహ్వానం అయితే అందరలేదు. ఇంకా సమయం ఉన్నందున ఈ పది రోజుల్లో ఎన్డీఏ నుంచి టీడీపీకి ఆహ్వానం అందుతుందేమో వేచి చూడాల్సిందే.