Crime News : యువతి ప్రాణం తీసిన ఫేస్ బుక్ లవ్.. లవర్ ను పెళ్లాడి చివరకు శవం అయింది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Crime News : యువతి ప్రాణం తీసిన ఫేస్ బుక్ లవ్.. లవర్ ను పెళ్లాడి చివరకు శవం అయింది

Crime News : ఫేస్ బుక్ లవ్ ఓ యువతి ప్రాణం తీసింది. ప్రేమను గుడ్డిగా నమ్మి చివరకు తన ప్రాణాలే పోయేలా చేసుకుంది ఓ యువతి. ఈ ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లాలో చోటు చేసుకుంది. బెంగళూరులోని విజయనగరకు చెందిన 22 ఏళ్ల సిరికి కొన్ని నెలల కింద ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అది ఫేస్ బుక్ లో. అతడి పేరు ఆదర్శ్ అని పరిచయం చేసుకున్నాడు. రోజూ వీళ్లిద్దరూ ఫేస్ బుక్ లో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :30 January 2023,9:00 am

Crime News : ఫేస్ బుక్ లవ్ ఓ యువతి ప్రాణం తీసింది. ప్రేమను గుడ్డిగా నమ్మి చివరకు తన ప్రాణాలే పోయేలా చేసుకుంది ఓ యువతి. ఈ ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లాలో చోటు చేసుకుంది. బెంగళూరులోని విజయనగరకు చెందిన 22 ఏళ్ల సిరికి కొన్ని నెలల కింద ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అది ఫేస్ బుక్ లో. అతడి పేరు ఆదర్శ్ అని పరిచయం చేసుకున్నాడు. రోజూ వీళ్లిద్దరూ ఫేస్ బుక్ లో చాట్ చేసుకునేవారు. ఆ తర్వాత నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు.

woman dead in rent house after marrying his lover in karnataka

woman dead in rent house after marrying his lover in karnataka

ఆ తర్వాత వీళ్ల స్నేహం కాస్త ప్రేమగా మారింది. కొన్ని నెలలు ప్రేమించుకున్నాక.. ఇద్దరూ కలిసి జీవించాలని అనుకున్నారు. దీంతో ఇద్దరూ బయటికి వచ్చేసి లేచిపోయారు. గుండెనహళ్లి అనే గ్రామానికి ఇద్దరూ చేరుకున్నారు. తమకు పెళ్లి అయిందని.. ఇద్దరం భార్యాభర్తలం అని చెప్పి ఇద్దరూ ఒక రూమ్ అద్దెకు తీసుకొని అక్కడ ఉండసాగారు. ఇద్దరూ పెట్రోల్ బంక్ లోనే పనిచేస్తూ పొట్టకూటి కోసం డబ్బులు సంపాదించేవారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత వాళ్లు ఉంటున్న అద్దె ఇంట్లోనే ఆ యువతి శవం అయింది. అసలు ఆ యువతి ఎలా చనిపోయింది అనేది ఇప్పటికీ ఎవ్వరికీ అంతుపట్టడం లేదు.

Crime News : ఆదర్శ్ ఇంట్లో లేకపోవడంతో అతడిపై పోలీసుల అనుమానం

ఆదర్శ్ ఇంట్లో లేకపోవడం, ఇంట్లో సిరి శవమై కనిపించడంతో పోలీసులకు అతడిపై అనుమానం పెరిగింది. అతడని గాలిస్తున్న పోలీసులు.. అతడే సిరిని చంపి.. ఇక్కడి నుంచి పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అసలు.. ఇద్దరికీ పెళ్లి అయిందా? లేక సహజీవనం చేస్తున్నారా? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం లేపింది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది